Begin typing your search above and press return to search.
కలమనాథులు...కాంగ్రెస్ ను వదిలేలా లేరే!
By: Tupaki Desk | 26 Jun 2017 4:39 AM GMTగడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కలమనాథులు... నాడు తమ చేతుల్లో చిత్తుగా ఓడిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ను ఇకపైనా వదిలేనా లేరన్న వాదన వినిపిస్తోంది. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ... తమ స్వప్రయోజనాల కోసం పలు దౌర్జన్యాలకు పాల్పడిందని, ఆ దురాగతాలన్నింటినీ భావి తరాలు తెలుసుకునేలా చర్యలు చేపడతామని బీజేపీ ప్రతినబూనింది. ఇందులో భాగంగా దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో దేశంలో 21 నెలల పాటు అమలైన ఎమర్జెన్సీని వారు ప్రధానాస్త్రంగా తీసుకున్నారు.
ఇప్పటికే ఈ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు నాటి ఎమర్జెన్సీ సమయంలో దేశంలో చోటుచేసుకున్న దుష్పరిణామాలను ప్రచారం చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించిన మోదీ కేబినెట్ లోని మంత్రులు ఎమర్జెన్సీ సమయంలో దేశంలో చోటుచేసుకున్న దురాగతాలను వివరించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో పాటు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ - కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ఎమర్జెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమర్జెన్సీ నాటి కాలాన్ని చీకటి రోజులుగా అభివర్ణించిన ఆయన... నాటి పరిస్థితులను భావి తరాలకు తెలియజేసేందుకు ఎమర్జెన్సీని పాఠ్యాంశంగా చేరుస్తామని ప్రకటించారు. ఇందుకు విద్యావేత్తలు సహకరించాలని కూడా ఆయన కోరారు. ప్రజాస్వామిక భారత దేశంలో ఎమర్జెన్సీని మించిన చీకటి రోజు లేదని కూడా ఆయన ధ్వజమెత్తారు. పదవిని కాపాడుకునేందుకే నాడు ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారని ఆయన ఆరోపించారు. అయితే అందుకు ఫలితంగా 1997లో జరిగిన ఎన్నికల్లో ఇందిర గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్నారు. వెంకయ్య... కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్స్ మోగించారనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/