Begin typing your search above and press return to search.

జగన్ కు ఐటీ శాఖ క్లీన్ చిట్

By:  Tupaki Desk   |   20 Nov 2016 11:15 AM GMT
జగన్ కు ఐటీ శాఖ క్లీన్ చిట్
X
కొద్దిరోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు - ఆయన మంత్రివర్గ సహచరులు - టీడీపీలో నోరున్న నేతలు అంతా కలిసి నిరాధారంగా జగన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. హైదరాబాద్ లో ఒక వ్యక్తి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో 10 వేల కోట్లు చూపించారని... అది జగనేనని ఆరోపిస్తున్నారు. జగన్ దాన్ని ఖండించినా కూడా ఎలాంటి ఆధారం లేకుండా అదే మాటను పదేపదే చెబుతున్నారు. దీంతో జగన్ స్వయంగా దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆ డబ్బు తనది కాదని ప్రకటించి.. ఆ పదివేల కోట్ల సంగతి తేల్చాలంటూ ప్రధానికి జగన్ లేఖ కూడా రాశారు.

జగన్ లేఖ నేపథ్యంలో విచారణ జరిపిన ఐటీ శాఖ 10వేల కోట్లు సంగతి అవాస్తవమని తేల్చేసింది. ఒక వ్యక్తి పదివేల కోట్లు డబ్బును చూపించారంటూ జరిగిన ప్రచారం వెనుక అసలు సంగతి వెల్లడించింది.

స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం అప్లికేషన్‌ లో ఒక వ్యక్తి సంచలనం కోసం తన ఆదాయాన్ని 10వేల కోట్లుగా చూపారట. దాని ఆధారంగా విచారించగ సదరు వ్యక్తికి కోటి రూపాయలు చెల్లించే స్థాయి లేదని తేలింది. చిన్న కుటీర పరిశ్రమను నడుపుతున్న ఆ వ్యక్తి సంచలనం చేయడానికి ఇలా చేశాడని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ వ్యక్తికి చెందిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఐటీ శాఖ నిరాకరించింది. మొత్తం మీద చంద్రబాబు - దేవినేని ఉమా లాంటి మంత్రులు చేసిన ఆరోపణలు అబద్దమని ఐటీ శాఖే తేల్చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/