Begin typing your search above and press return to search.
డిపాజిట్లు రూ.2.5 లక్షలు దాటితే!!
By: Tupaki Desk | 10 Nov 2016 3:31 AM GMTప్రస్తుతం భారతదేశంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు... నోటు! అవును ఇప్పుడు 120+ కోట్ల మంది నోట్లమార్పిడి గురించే ఆలోచిస్తున్నారన్నా అతిశయోక్తి కాదేమొ. ఈ విషయంలో ఎప్పుడు మార్చుకోవాలి - ఎక్కడ మార్చుకోవాలనే దానిపై క్లారిటీ వచ్చినా... ఎంత మార్చుకోవచ్చు, ఎంత మార్చుకుంటే ఐటీ సమస్యలుండవు.. పన్ను మినహాయింపు ఎంత నగదు మార్పువరకూ అనుమతి అనే విషయాలపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ విషయంలో గృహిణులు - రైతులు రూ.2.5 లక్షల వరకూ పెద్ద నోట్లను డిపాజిట్ చేసినా ఆమోదోళన చెందాల్సిన అవసరం లేదని ఐటీశాఖ అధికారులు అభయమిస్తున్నారు.
ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చిన రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ అధియా... "ఈ ఏడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసే అన్ని ఖాతాల వివరాలు తెప్పించుకుంటాం" అని ప్రకటించారు. ఈ ఖాతల డిపాజిట్ల వ్యవహారాలు - ఆయా డిపాజిటర్లు సమర్పించిన ఆదాయ రిటర్నులతో పోల్చిచూసినప్పుడు తేడాలుంటే దానికి తగినట్లు చర్యలు తప్పవు! ఈ క్రమంలో ప్రస్తుతం రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై పన్ను ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. అలాగే రిటర్నుల్లో సమర్పించిన ఆదాయ వివరాలతో సరిపోలకపోతే విధించే జరిమానా 200 శాతంగా ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ విషయంలో ఖాతాదారుడు సమర్పించిన వివరాలు సరిపోలకపోతే అప్పుడు ఆదాయపు పన్ను చట్టం 270 (ఎ) కింద 200 శాతం పెనాల్టీ విధిస్తారు. ఇక ఆభరణాలు కొనే వారు కచ్చితంగా పాన్ నంబర్ ను సమర్పించాల్సి ఉంటుందని.. కొనుగోలుదారుల నుంచి పాన్ నంబర్లు తీసుకోకపోతే దానికి చర్యలు నగల దుకాణదారులపై ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కొత్త నోట్ల విషయంలో పన్ను మినహాయింపు పరిమితిలో ఉన్నవారు నగదు డిపాజిట్ చేసినా భయపడాల్సిన పనేమీ లేదని - అనుమానాస్పద కేసులైతే తప్ప అలాంటి వారి జోలికెళ్లమని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు!
ఈ విషయమై మరింత క్లారిటీ ఇచ్చిన రెవెన్యూ శాఖాధికారులు... 2-3 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసే వారి వివరాలనే పన్ను శాఖ పరిశీలిస్తుందని - గృహిణులు - రైతులు రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసినా ఎలాంటి పన్ను ఉండదని చెప్పారు. నగదు లావాదేవీల కంటే బ్యాంకు ఖాతా - చెక్ - ఎలక్ట్రానిక్ చెల్లింపులను అనుసరిస్తే మేలని.. మొత్తం కరెన్సీ మార్పిడికి 3 నుంచి 4 వారాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/