Begin typing your search above and press return to search.
క్రాస్ చెక్ చేస్తుంటే అంతా ‘గాలి’ లెక్కలేనట
By: Tupaki Desk | 30 Nov 2016 4:03 AM GMTమొన్నటి వరకూ మైనింగ్ అక్రమ రవాణా కేసులతో మీడియాలో ప్రముఖంగా కనిపించిన గాలి జనార్దన్ రెడ్డి.. ఈ మధ్యన కుమార్తె పెళ్లితో మరోసారి మీడియాలో ప్రముఖంగా దర్శనమివ్వటం తెలిసిందే. వందల కోట్ల రూపాయిల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసి.. కూతురు పెళ్లిని అట్టహాసంగా పూర్తిగా చేసిన గాలి జనార్దన్ కు ఐటీ శాఖ ఇస్తున్న షాకులు అన్నీ ఇన్నీ కావు.
భారీగా చేసిన పెళ్లికి సంబంధించి ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమధ్యన ‘గాలి’ ఆడని జనార్దన్ రెడ్డి.. ఎట్టకేలకు వారు అడిగిన 15 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ‘గాలి’ ఇచ్చిన సమాధానాలపై దృష్టి పెట్టిన ఐటీ శాఖ.. తమ దగ్గర ఉన్న వివరాలు.. ఆధారాలతో క్రాస్ చెక్ చేయటం మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది.
అయితే.. పెళ్లి ఖర్చుకు సంబంధించిన వివరాల విషయంలో ఆసక్తికర కోణం కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. గాలి వారు ఇచ్చిన సమాధానాలకు.. లెక్కలకు మధ్యన పొంతన కుదరటం లేదని.. లెక్కలు తేలటం లేదన్న మాట చెబుతున్నారు. పెళ్లి మండపం.. అలంకరణ.. భోజన ఏర్పాట్లు.. వస్త్రాలు..ఆభరణాలు.. వచ్చిన అతిధులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ తో పాటు.. ఆర్చకులకు చెల్లించిన మొత్తాల్ని నిశితంగా పరిశీలిస్తున్న ఆదాయపన్ను అధికారులకు.. లెక్కల్లో తేడాలున్న విషయాన్న గుర్తించినట్లుగా చెబుతున్నారు. తమ దగ్గర ఉన్న వివరాలకు.. గాలి జనార్దన్ ఇచ్చిన సమాధానాలకు పొంతన కుదరటం లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గాలిని మరోసారి పెళ్లి ఏర్పాట్లు.. వివరాలు.. ఖర్చులపై మరోసారి ప్రశ్నల వర్షం కురవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/