Begin typing your search above and press return to search.

విదేశాల్లో దాచిన బ్లాక్ మనీ అంతేనట

By:  Tupaki Desk   |   8 Feb 2017 9:16 AM GMT
విదేశాల్లో దాచిన బ్లాక్ మనీ అంతేనట
X
వేలాది కోట్ల బ్లాక్ మనీ విదేశాల్లో మూలుగుతుందంటూ చెప్పే కథనాలకు క్లారిటీ ఇచ్చేశారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. హెచ్ఎస్ బీసీ.. ఐసీఐజేలు ఇచ్చిన జాబితాల మీద విచారణ జరిపిన అనంతరం.. విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం రూ.16.2వేల కోట్లుగా తేల్చారు. హెచ్ ఎస్ బీసీ బ్యాంకు విదేశీ శాఖల్లో భారతీయులు దాచిన రూ.8200 కోట్ల నగదును గడిచిన రెండేళ్లలో పన్ను పరిధిలోకి తెచ్చినట్లుగా చెప్పిన ఆయన.. మరో రూ.8వేల కోట్లను రుణంగా తీసుకున్నట్లుగా గుర్తించినట్లుగా చెప్పారు.

విదేశాల్లో భారతీయులు దాచిన నగదు లెక్కపై సరైన లెక్కలులేవని చెప్పిన ఆయన.. పెద్దనోట్ల రద్దు అనంతరం కొత్తగా వినియోగంలోకి తీసుకొచ్చిన నోట్ల లెక్కల్ని వెల్లడించారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ నవంబరు 8 - 2016లో ప్రధాని నిర్ణయం వెల్లడించిన రెండు రోజుల తర్వాత నవంబరు 10 నుంచి జనవరి 13 మధ్య కాలంలో మొత్తంగా రూ.6.78 లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో రూ.9.1లక్షల కోట్ల నోట్లు చెలామణిలో ఉన్నట్లుగా చెప్పినఆయన.. రద్దు చేసిన పెద్దనోట్లు (వెయ్యి.. రూ.500) మొత్తంగా రూ.12.44లక్షల కోట్లుగా చెప్పారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నేరుగా డబ్బులు ఇవ్వకుండా.. ఖాతాల్లో జమ చేయటం ద్వారా.. నకిలీలను అరికట్టామని.. దీంతో గడిచిన రెండేళ్లలో రూ.21వేల కోట్ల సబ్సిడీ మొత్తాన్ని మిగిల్చినట్లుగా వెల్లడించారు. మరిన్ని వేల కోట్లను పక్కదారి పట్టకుండా ఆపినప్పుడు.. ఆ మొత్తాన్ని వేటికి వినియోగించారన్న విషయంపై మరింత క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/