Begin typing your search above and press return to search.
దేశంలో అలాంటి డాక్టర్లు..సీఏలు 2200 మందేనట!
By: Tupaki Desk | 15 Feb 2020 3:30 AM GMTదేశ జనాభాకు.. ఆదాయ పన్ను శాఖకు వార్షిక ఆదాయం మీద విధించే పన్ను వసూళ్లకు సంబంధించి వచ్చే మొత్తాలకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఓవైపు ఊరు ఏదైనా.. కళ్లు చెదిరే భవనాలు పెద్ద ఎత్తున కనిపిస్తాయి. ఇక.. ఢిల్లీ.. ముంబయి.. బెంగళూరు.. హైదరాబాద్.. చెన్నై.. లాంటి మహానగరాల్ని తీసుకుంటే.. ఇలాంటి భవనాలు ఎన్నికనిపిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కంటి ముందు ఇంత భారీ కట్టడాలు కనిపిస్తున్నా.. వార్షిక ఆదాయపన్నుకట్టే విషయంలో ఐటీ శాఖకు వచ్చే సమాచారం చూసినప్పుడు అవాక్కు అవ్వాల్పిందే. ఎందుకంటే.. దేశంలో వార్షికంగా కోటి రూపాయిల ఆదాయం.. అంటే నెలకు రూ.8.5లక్షల పొందే వైద్యులు.. సీఏలు .. లాయర్లు కేవలం 2200 మంది మాత్రమేనని తేల్చారు. ఈ విషయాన్ని ఐటీ శాఖ వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.78 కోట్ల మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేశారని.. వారిలో 1.03 కోట్ల మంది వ్యక్తిగత ఆదాయం రూ.2.5లక్షలు కాగా.. 3.29 కోట్ల మంది ఆదాయం రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షలు చూపించింనట్లుగా వెల్లడించింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు చూపించిన వారు 4.32 కోట్లుగా పేర్కొంది. వీరు ఎలాంటి ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
రూ.50 లక్షల ఆదాయం పొందుతున్నవారు 3.16లక్షల మంది కాగా.. వీరిలో 8600 మంది మాత్రమే ఏడాదికి రూ.5కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లుగా పేర్కొన్నారు. వీరిలో 2200 మంది మాత్రమే వైద్యులు.. ఇంజినీర్లు.. లాయర్లు..సీఏలు ఉన్నట్లుగా ఐటీ శాఖ పేర్కొంది. ఇప్పుడు అర్థమైందా? ఐటీ శాఖకు రావాల్సిన పన్ను మొత్తాలు ఎక్కడ పక్కదారి పడుతున్నాయో?