Begin typing your search above and press return to search.

బాబు స‌న్నిహిత నేత కుటుంబంపై ఐటీ పంజా

By:  Tupaki Desk   |   15 Nov 2018 1:21 PM GMT
బాబు స‌న్నిహిత నేత కుటుంబంపై ఐటీ పంజా
X
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ర్టాల్లో ఐటీ సోదాలు ప్రకంపనాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌తో పాటుగా ఏపీలో కూడా ఈ దాడులు జ‌రుగుతుండ‌గా..తమపై కేంద్రం వివక్ష చూపిస్తోందని..అందులో భాగంగానే తమ పార్టీకి చెందిన నేతలపై ఈడీ - ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వాపోతున్నారు. ఇదిలాఉండ‌గా...తాజాగా బాబు స‌న్నిహితుడు అయిన నేత కుటంఉబంపై దాడులు జ‌రిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో హోం మంత్రిగా పనిచేసిన దేవేందర్ గౌడ్ - అతని కుమారుడు వీరేంద్ర నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

నవంబర్ 15వ తేదీ గురువారం ఉదయం 20 బృందాలుగా వచ్చిన ఐటీ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. డ్యూక్ బిస్కెట్ కంపెనీ - డీఎస్ ఏ బిల్డర్స్ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని - ఐటీ చెల్లింపులు సక్రమంగా చెల్లించడం లేదనే ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా రవి ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ - డీఎస్ ఏ బిల్డర్స్ అండ్ కన్‌ స్ట్రక్షన్స్ - శాంతారామ్ కన్ స్ట్రక్షన్స్ లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రవి ఫుడ్స్ డైరెక్టర్లు రవీందర్ కుమార్. అగర్వాల్ - రాజేంద్ర కుమార్ అగర్వాల్ - కేదార్ నాథ్ అగర్వాల్ ఇండ్లఫై ఐటీ సోదాలు చేశారు. దీనిపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్ల‌డించాల్సి ఉంది. శాంతా శ్రీరామ్ ఎండీ మడ్డి నర్సయ్య ఇంట్లో ఐటీ సోదాలు నిర్వ‌హించారు. రవి ఫుడ్స్‌ కి ప్రమోటర్లుగా దేవేందర్ గౌడ్ కుమారులు ఉన్న‌ట్లు స‌మాచార‌. అయితే, వారు గ‌తంలోనే త‌మ వాటాల‌ను వెన‌క్కు తీసుకున్నార‌ని తెలుస్తోంది. మహాకూటమి తరపున ఉప్పల్ నియోజకవర్గం నుంచి దేవేందర్‌ గౌడ్‌ కుమారుడు వీరేందర్‌ గౌడ్‌ బరిలోకి దిగారు.