Begin typing your search above and press return to search.
ఒక్క మెయిల్ ఐడీ..మూడు రోజులు..నాలుగు వేల మెయిల్స్..
By: Tupaki Desk | 20 Dec 2016 7:31 AM GMTలంచాలు పీక్కుతుని.. మోసాలు చేసి.. జనాన్ని దోచుకుని.. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి... ఎన్నిరకాలుగా అయితే అన్ని రకాలుగా అడ్డగోలుగా సంపాదించి అక్రమాస్తులు కూడబెట్టుకున్న నల్లధనవంతులంటే సామాన్యులు మండిపడుతున్నారు. మోడీ దెబ్బకు నల్లధనవంతులకు దిమ్మ తిరుగుతోందని చాలామంది సంతోషిస్తున్నారు. పనిలో పనిగా తామూ ఒక దెబ్బేయాలని ఎందరో కోరుకుంటున్నారు. కానీ... అలాంటి అవకాశం ఇంతవరకు జనానికి దొరకలేదు. ఇప్పుడు గవర్నమెంటు తాజాగా నల్లధనవంతుల గుట్టమట్లన్నీ మాకు చెప్పండి.. మీరు ఎవరు? ఏమిటి అనేది అడక్కుండానే మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వారి పని పడాతాతమని చెప్పింది. సమాచారం ఇవ్వాలంటూ ఒక మెయిల్ ఐడీ కూడా అనౌన్స్ చేసింది.. ఇంకేముంది ప్రజల చేతికి వజ్రాయుధం ఇచ్చినట్లయింది... వేలకొద్దీ మెయిల్సు.. ఇది ప్రకటించి మూడు రోజులైంది. కానీ.. లెక్కలేనన్ని మెయిల్సు వచ్చాయి.
నల్లధనం ఎవరి దగ్గరైనా ఉందని అనుమానం వస్తే తెలియజేయాలంటూ - భారత ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన తరువాతి క్షణం నుంచి ఈ-మెయిల్స్ వెల్లువెత్తాయి. 'blackmoneyinfo@incometax. gov.in' మెయిల్ కు నల్లధనాన్ని దాచుకున్న వారి వివరాలు ఇవ్వాలని మోదీ సర్కారు కోరిన నేపథ్యంలో 72 గంటల వ్యవధిలో 4 వేలకు పైగా మెయిల్స్ వచ్చాయి.
తమ విన్నపానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చిందని, ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ మెయిల్స్ అన్నీ పరిశీలిస్తున్నామని, అనుమానం వస్తే, వాటిని పరిశీలిస్తున్నామని, దాడులు జరిపేందుకూ సిద్ధంగా ఉన్నామని సదరు అధికారి తెలిపారు. ఈ మేరకు ఎఫ్ ఐయూ (ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్) చర్యలు తీసుకోనుందని వెల్లడించారు. జన్ ధన్ ఖాతాల్లో చేరిన భారీ మొత్తంలో డబ్బుతో పాటు - ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు - బ్యాంకు అధికారుల ప్రమేయం తదితరాంశాలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని, బంగారం - లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు తదితరాలపైనా మెయిల్స్ అందుకున్నామని ఆర్థిక శాఖ అధికారి స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/