Begin typing your search above and press return to search.

హమ్మయ్యా.. దేశంలో అమ్మాయిలు పెరిగారు

By:  Tupaki Desk   |   26 Nov 2021 4:32 AM GMT
హమ్మయ్యా.. దేశంలో అమ్మాయిలు పెరిగారు
X
భారతదేశంలో అమ్మాయిల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలువడ్డాయి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేపట్టే ఈ సర్వేలో తొలిసారిగా అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా నమోదైంది. చాలా స్పష్టంగా ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1020 మంది అమ్మాయిలు ఉన్నట్లు తేలింది. వాస్తవానికి ఇది ఇది చాలా ఆకర్షణీయమైన విషయం. గతంలో అయితే అమ్మాయి అని గర్భధారణ సమయంలో తెలిస్తే పురిట్లోనే వారిని చంపేసే వారు.. దీంతో గత కొన్ని ఏళ్లుగా లింగ అసమానతలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఎంతలా అంటే చాలా సామాజిక వర్గాల్లో ప్రస్తుతం పెళ్లి చేసుకునే దానికి అమ్మాయిలు కరువయ్యే అంత లోతు కనిపించింది. ఈ తరుణంలో అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్య దాటడం శుభ పరిణామంగా నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో విడుదల చేసిన సర్వే ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే అమ్మాయిల సంఖ్య చాలా మెరుగు పడింది. ఇంతకుముందు పురుషులతో పోల్చితే స్త్రీలు కేవలం ప్రతి వెయ్యి మందికి 992 మంది మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 1020 కి పెరిగింది.

సర్వేలో వెలుగు చూసినా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లింగ నిష్పత్తి కూడా పెరగడం గతంలో ఉన్న దానికంటే ఈసారి నిర్వహించిన సర్వేలో సుమారు 10 శాతం అమ్మాయిల సంఖ్య పెరిగింది. 2015 సంవత్సరంలో అమ్మాయిల సంఖ్య 1919 గా ఉంటే 2021 సంవత్సరం లో వారి సంఖ్య 1920 పెరిగినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. లింగ నిష్పత్తి ప్రకారం చూసుకుంటే పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంది సుమారు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1037 మంది అమ్మాయిలు ఉన్నట్లు తేలింది. నగరాల్లో అయితే వీరి సంఖ్య 985 కు మాత్రమే పరిమితమైందని అధికారులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అవగాహన కార్యక్రమాల మూలంగా ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.

గత ఏడాదితో పోల్చుకుంటే సంతానోత్పత్తి రేటు అనేది మరింత తగ్గినట్లు అధికారులు చెప్పారు. సాధారణంగా సంతానోత్పత్తి రేటు అనేది 2.1 శాతానికి మించకూడదు. ఇలా మించి నట్లయితే ప్రతి కుటుంబంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు భావిస్తారు. క్రితంసారి చేపట్టిన సర్వేలో ఈ శాతం 2.2 గా ఉండింది అని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ శాతం మరింత దిగజారి 2.1 వద్ద స్థిరంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ సర్వేలో ఆందోళనకరమైన విషయం ఒకటి వెల్లడైంది. చాలా మంది అమ్మాయిలు పదేళ్ల కంటే తక్కువ వయసులోనే చదువుకు ముగింపు పలుకుతూ ఉన్నట్లు తేలింది. చాలా మంది పాఠశాల విద్యను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

తీసుకొని వచ్చిన జన్ ధన్ ఖాతాల ఓపెనింగ్ వల్ల చాలా మంది మహిళలకు బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లు సర్వేలో స్పష్టమైంది. సుమారు 70 శాతానికిపైగా మందికి బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి. ఈ కాలంలో మహిళలు ఆరోగ్య సంరక్షణ మీద కూడా దృష్టి సారించాలని సర్వేలో వెల్లడైంది. పీరియడ్స్ సమయంలో ప్రత్యేకంగా ఆరోగ్యంపై మహిళలు ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నట్లు తేలింది. భారత దేశంలో సుమారు 30 శాతం మంది మహిళలకు సరేనా బాత్రూం వసతి లేదని ఈ సర్వేలో తేలింది. వీరంతా ఆరు బయట మలవిసర్జన పాల్పడుతున్నట్లు అధికారులు తేల్చారు.