Begin typing your search above and press return to search.

చైనా తన గొయ్యి తానే తవ్వుకుందా?

By:  Tupaki Desk   |   20 Dec 2022 8:38 AM GMT
చైనా తన గొయ్యి తానే తవ్వుకుందా?
X
జిత్తుల మారి చైనా తన గొయ్యి తానే తవ్వుకుందా? అంటే అంతా అవుననే అంటున్నారు. కరోనా (మానవ సృష్టి) చైనా పనేనని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. దీనిని డ్రాగన్ కంట్రీ ఖండిస్తున్నా ఎవరూ నమ్మడం లేదు. కరోనా విషయంలో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన చైనాను మాత్రం ఆ మహమ్మరి మాత్రం వదలడం లేదు. దీంతో అయ్యో చైనా 'ఫాఫం(పాపం)' అనకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది.

మూడేళ్ల క్రితం చైనాలో వ్యూహన్ నగరంలో తొలిసారి కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనా విషయంలో చైనా తొలుత ఆ జాగ్రత్తగా వ్యవహరించడంతో అది దేశమంతా వ్యాపించింది. ఈ క్రమంలోనే కరోనా కట్టడి కోసం చైనా జీరో కోవిడ్ విధానాన్ని తీసుకొచ్చింది. కఠినమైన నిబంధనలు అమలులోకి తీసుకొచ్చి కరోనా ఫస్ట్ వేవ్ లో మహమ్మారిని సమర్ధవంతంగా అడ్డుకుంది.

అయితే అంతకుముందే కరోనా చైనా నుంచి క్రమంగా ఇతర దేశాలకు పాకింది. దీంతో ఆయా దేశాల్లో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చేసేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్.. పాక్షిక లాక్ డౌన్ పాటించాయి. కరోనా కేసుల విషయంలో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. 10 కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా 11 లక్షల మంది చనిపోయారు.

ఆ తర్వాత కరోనాతో ప్రాణాలు కోల్పోయిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 4.5కోట్ల మంది కరోనా బారిన పడగా 5.5లక్షల మంది మృతిచెందారు. ఇటలీ.. బ్రిటన్ తదితర దేశాల్లో ప్రాణనష్టం భారీగానే జరిగింది. దీంతో ఈ పాపమంతా చైనాదేననే విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తాయి. ఆ తర్వాత కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో అన్ని దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మాస్కులు ధరించాల్సిన అవసరం లేనంతగా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ప్రజలు కరోనా బారిన పడుతున్నప్పటికీ ప్రాణనష్టం పెద్దగా ఉండటం లేదు. అయితే చైనాలో మాత్రం ఒమ్రికాన్ వేరియంట్ తీవ్రరూపం దాల్చుతోంది. ప్రతీరోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు సైతం సంభిస్తుండటం ఆందోళనను రేకెత్తిస్తోంది.

చైనాలో 15 రోజుల కిందట జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేయడంతో కేసుల సంఖ్య భారీగా పెరిగి పోతోంది. ఆస్పత్రులన్నీ కరోనా పేషంట్లతో నిండిపోతున్నాయి. కొత్త పేషంట్లకు బెడ్లు దొరకని పరిస్థితి. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి చోటు దొరకని పరిస్థితి ప్రస్తుతం చైనాలో నెలకొన్నాయి.

2023 ఏడాదిలో ఏప్రిల్ నాటికి చైనాలో 10 లక్షల మంది మృతి చెందుతారని ఇటీవల అమెరికా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో చైనాను చూసి పాపం అనాలా? లేదంటే చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తుందని వదిలేయాలా? అన్న దుస్థితి నెలకొంది. ఏది ఏమైనా చైనా పరిస్థితి చూస్తుంటే మానవత్వం ఉన్న వారెవరైనా అయ్యో చైనా 'ఫాఫం(పాపం)' అనాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.