Begin typing your search above and press return to search.

కరోనా వేళ ఎయిర్ అంబులెన్సులకు పెరిగిన డిమాండ్.. మరి ఖర్చు ఎంత?

By:  Tupaki Desk   |   17 May 2021 1:30 PM GMT
కరోనా వేళ ఎయిర్ అంబులెన్సులకు పెరిగిన డిమాండ్.. మరి ఖర్చు ఎంత?
X
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో రకాల కొత్త అనుభవాలు పుట్టుకొచ్చాయి. ఈ విపత్కర కాలంలో ఎయిర్ అంబులెన్సులకు గిరాకీ పెరిగింది. అత్యవసర పరిస్థితులు, పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని తరలించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. కొండ ప్రాంతాలు, రవాణా సరిగా లేని ప్రాంతాల్లో బాధితులను తరలించడానికి ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. అంబులెన్సుల మాదిరిగానే వీటిలోనూ అన్ని సదుపాయాలు ఉంటాయి. మరి వీటి ధర పేషెంట్ కండీషన్ పై ఆధారపడి ఉంటుంది. దేశంలో ఈ సేవలు ఎక్కడెక్కడా అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందామా?

ఇంటర్నేషన్‌ల్‌ క్రిటికల్‌ కేర్‌ ఎయిర్‌ ట్రాన్స్‌ఫర్‌ టీమ్‌ ను ఓ డాక్టర్ల బృందం నిర్వహిస్తోంది. ఐకాట్ పేరుతో ఈ ఎయిర్ అంబులెన్సులకు డిమాండ్ పెరిగింది. వీరికి నాలుగు ఎయిర్ క్రాఫ్టులు ఉన్నాయి. బెంగుళూరు, హైదరాబాద్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. సర్వీసు వెల రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉంటుంది. 91-9701111156 నంబర్ కు ఫోన్ చేసి సేవలను వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలు (https://www.icatt.in/) ఈ వెబ్సైట్ లో ఉంటాయి.

ఎయిర్ రెస్క్యూయర్స్ పేరుతో దిల్లీకి చెందిన ఓ సంస్థ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం డిమాండ్ ఉండడం వల్ల ఈ ఖర్చు రూ.15 లక్షలకు చేరింది. +91-9773331118 నంబర్కు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను (https://airambulance-india.com/) వెబ్సైట్లో పొందుపర్చారు.

మేదాంత ఎయిర్ అంబులెన్సు దేశంలోని అన్నిప్రాంతాల్లో అందుబాటులో ఉంది. దీని ఖర్చు రూ.75 వేల నుంచి రూ.3లక్షల వరకు ఉంది. 91-124-4141414, https://www.medanta.org/facilities-services/air-ambulance/ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. లిమ్రా సంస్థ దిల్లీ, ముంబయి, హైదరాబాద్లో ఎయిర్ అంబులెన్సులు సేవలు అందిస్తోంది.

బ్లేడ్ ఇండియా సంస్థ... కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎయిర్ అంబులెన్సు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ సేవలకు రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మరిన్ని వివరాల కోసం 1800-102-5233, customerservice@flyblade.in, https://www.instagram.com/blade.india/ ద్వారా సంప్రదించవచ్చు.

చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లో అపోలో సర్వీసు హబ్ లు అందుబాటులో ఉన్నాయి. మధురై, మైసూరు, కాకినాడ,కారైకుడి, కరూర్, త్రిచ్చి, విశాఖపట్నల్లోనూ ఇవి ఈ సేవలు అందిస్తున్నారు. వీరు గంటకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. https://www.apollohospitals.com/departments/emergency-trauma-care-services/air-ambulance-services/ ఈ వెబ్ సైట్ తో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.