Begin typing your search above and press return to search.
ఆదాయాలు పెరిగే.. ఐటీ కంపెనీలపై పెరిగిన అంచనాలు
By: Tupaki Desk | 19 Dec 2021 4:30 PM GMTకరోనా కల్లోలంలో అన్నీ మూతపడ్డాయి. లాక్ డౌన్ వచ్చి అందరూ ఇంట్లో కూర్చుకున్నారు. ప్రభుత్వాలు, ప్రైవేటు రంగాలు అన్నీ కుదేలయ్యాయి. కరోనా దెబ్బకు ఇప్పటికీ ఐటీ రంగం అస్తవ్యస్తమైంది. అయితే కుదటపడుతున్న వేళ ఒమిక్రాన్ ప్రభావంతో పలు రంగాలు మళ్లీ కుదుపునకు గురవుతున్నాయి. ఐటీ రంగం మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకెళుతోంది. సంప్రదాయ కంపెనీలు సైతం డిజిటల్ బాట పట్టడం ఐటీ రంగానికి వరంగా మారింది. ప్రస్తుతం ఖాతాదారుల నుంచి ప్రాజెక్టుల పొడిగింపు లభిస్తుండగా కొత్తగా వస్తున్న భారీ ఆర్డర్లను నెరవేర్చేందుకు.. నియామకాల విషయంలోనూ సంస్థలు జోరు కనబరుస్తున్నాయి.
దేశీయంగా యువ ఉద్యోగుల నియామకాల్లో ఐటీ రంగం ముందుస్థానంలో నిలుస్తోంది. కోవిడ్19 కారణంగా మొదలైన వర్క్ ఫ్రం హోం పనివిధానంతో ఖర్చులు తగ్గడం కూడా వీటికి కలిసి వస్తోంది. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో కంపెనీలు భారీగా ఆదాయ వృద్ధిని నమోదు చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నాయి.
తాజాగా ఐటీ దిగ్గజం యాక్సెంచర్ పీఎల్ సీ సెప్టెంబరు-నవంబర్ కు ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఆదాయంలో 27 శాతం వృద్ధి సాధించిన సంస్థ కొత్తగా 1680 కోట్ల డాలర్ల ఆర్డర్లను దక్కించుకుంది. ప్రస్తుత పరిస్థితులలో భారతీయ ఐటీ కంపెనీలు కూడా ఇదేవిధంగా లబ్ధి పొందే అవకాశాలున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి దేశీయ ఐటీ కంపెనీలు ఆదాయ అంచనాలను పెంచే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.
2021-22 సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఐటీ రంగం బలమైన ఆదాయ వృద్ధిని సాధించింది. త్రైమాసిక ఆదాయం, మార్జిన్ ల విస్తరణ పరంగా అగ్రగామి కంపెనీలకు ధీటుగా ద్వితీయ శ్రేణి కంపెనీలు రాణించాయి. క్లౌడ్, డేటా అనలిటిక్స్, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ వంటి విభాగాలకు గిరాకీ స్థిరంగా పెరుగుతూ వస్తోంది.
డాలర్ తో పోలిస్తే రూపాయి క్షీణత ఐటీ కంపెనీలకు కలిసొచ్చే అంశమే. విదేశీ కరెన్సీ రూపంలో ఈ కంపెనీలు భారీగా ఆదాయాన్ని ఆర్జించడమే ఇందుకు కారణం. భారతీయ ఐటీ కంపెనీలు కూడా 52 వారాల గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.