Begin typing your search above and press return to search.
పెరుగున్న భూముల మార్కెట్ రేటు.. రిజిస్ట్రేషన్ కోసం పోటాపోటీ
By: Tupaki Desk | 27 Jan 2022 8:37 AM GMTతెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలకు మార్కెట్ విలువ పెరుగబోతోందనే అంశం కొనుగోలుదారులను భయపెడుతోంది. స్థిరాస్తుల మార్కెట్ విలువ పెంపు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. స్థిరాస్తి వ్యాపారుల గుండెల్లో ఈ పరిణామం రైళ్లు పరిగెత్తిస్తోంది.
వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వాణిజ్యభవనాలు, అపార్ట్ మెంట్ల మార్కెట్ విలువ మదింపు జరుగబోతోందనే వార్త వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
వీరిలో కొందరు ఇప్పటికే జీపీఏ, కొనుగోలు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. స్థిరాస్తుల మార్కెట్ విలువ ఎంత పెంచుతారో, స్టాంప్ డ్యూటీ , రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు ఏ మేరకు ఉంటుందో.. తెలియక ఇబ్బందికి గురవుతున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువమంది జీపీఏ చేసుకున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువు ఉన్నప్పటికీ వచ్చే నెల నుంచి భూముల విలువలు పెరుగనున్నాయనే వార్తలతో అదనపు భారం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకోవడం..తేదీలు ఖరారు కావడంతో సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు.
ఇటీవలే అగ్రిమెంట్లు చేసుకున్న వారు కూడా రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుక్ చేసుకోవడానికి మీ సేవా కేంద్రాలు, ఆన్ లైన్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. జనవరి 31లోపే రిజిస్ట్రేషన్లుచేసుకునేందుకు కొందరు ఈ చలాన్ లు చెల్లిస్తున్నారు. సొంతింటి కల సాకారం చేసుకునేందుకు స్థలాలు, ఇళ్ల కొనుగోలు కోసం అడ్వాన్సులు ఇచ్చిన మధ్యతరగతి వారికి పెరుగనున్న మార్కెట్ విలువలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇక ప్రభుత్వానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్ లో అత్యధికంగా రూ.1030 కోట్ల ఆదాయం సమకూరింది. నెలలవారీగా చూస్తే స్థిరాస్తి లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం రెట్టింపు అవుతూనే ఉంది. గత ఏడాది మే మినహాయిస్తే మిగిలిన 9 నెలల్లో రాబడి పెరుగుతూనే ఉంది.