Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ పెరిగిన వ్యాక్సిన్ వ్య‌వ‌ధి.. ఇలాగైతే ఫ‌లితం ఉంటుందా?

By:  Tupaki Desk   |   2 July 2021 2:30 AM GMT
మ‌ళ్లీ పెరిగిన వ్యాక్సిన్ వ్య‌వ‌ధి.. ఇలాగైతే ఫ‌లితం ఉంటుందా?
X
అన్నం స‌రిప‌డా లేక‌పోతే.. దాన్ని సంపాదించుకునే మార్గాలు వెత‌కాలిగానీ.. మూడు పూట‌ల తిండిని ఒక్క‌ పూట‌కు కుదించుకోవ‌డం స‌రైన ప‌ద్ధ‌తి అవుతుందా? దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలోనూ ఇదేవిధ‌మైన ప‌ద్ధ‌తి కొనసాగుతుండ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా స‌రిగాలేక‌పోవ‌డంతో.. కొవిషీల్డ్ టీకా రెండో డోసు వ్య‌వ‌ధిని తెలంగాణ స‌ర్కారు మ‌రోసారి పొడిగించింది!

వాస్త‌వానికి వ్యాక్సిన్ ఉత్ప‌త్తి అయిన తొలి రోజుల్లో.. నాలుగు వారాల గ్యాప్ లో సెకండ్ డోస్ వేసుకోవాల‌ని చెప్పారు. కానీ.. వ్యాక్సిన్ ఉత్ప‌త్తి మంద‌గించ‌డంతో.. ఈ గ్యాప్ ను 8 వారాల‌కు పెంచారు. అయిన‌ప్ప‌టికీ.. ప‌రిస్థితిలో మార్పు రాలేదు. కావాల్సినంత ఉత్ప‌త్తి జ‌ర‌గ‌క‌పోవ‌డంతో.. ఈ గ్యాప్ ను 12 వారాలకు పెంచారు. అంటే.. తొలి వ్యాక్సిన్ వేసుకున్న 84 రోజుల‌ త‌ర్వాత సెకండ్ డోస్ వేసుకోవాల‌న్న‌మాట‌.

కేంద్ర ప్ర‌భుత్వం విధించిన‌ ఈ గ్యాప్ ఇప్ప‌టి వ‌ర‌కూ కొన‌సాగుతూ వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు ఈ గ్యాప్ కూడా పెరిగింది. ఈ సారి నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌భుత్వం స్వ‌యంగా తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. వ్యాక్సిన్ అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌ర్కారు తెలిపింది. అస‌లు తీసుకోనివారికి క‌నీసం ఒక్క‌డోసైనా ఇవ్వాల‌నే ఉద్దేశంతో తెలంగాణ స‌ర్కారు ఈ డెసిష‌న్ తీసుకుంది. ఈ కొత్త‌ నిర్ణ‌యం ప్ర‌కారం.. 84 రోజుల గ్యాప్ 98 రోజుల‌కు పెరిగింది. 98 రోజుల నుంచి 112 రోజుల గ్యాప్ లో సెకండ్ డోస్ వేసుకోవాల‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న ఈ నిర్ణ‌యాల‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ్యాక్సిన్ కొర‌త ఏర్ప‌డితే ఉత్ప‌త్తి పెంచాలిగానీ.. గ్యాప్ పెంచుకుంటూ పోతే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. దీనివ‌ల్ల ఆశించిన ఫ‌లితం ఎలా వ‌స్తుంద‌ని అడుగుతున్నారు. అమెరిక‌న్ వైట్ హౌస్ హెల్త్ అడ్వైజ‌ర్ ఫౌసీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇలా గ్యాప్ పెంచుతూ పోతే.. ఉప‌యోగం ఉండ‌ద‌ని, దీనివ‌ల్ల న‌ష్ట‌మేన‌ని కూడా వ్యాఖ్యానించారు. అయిన‌ప్ప‌టికీ.. భార‌త ప్ర‌భుత్వాలు మాత్రం వ్యాక్సిన్ డోసు గ్యాప్ పెంచుతూనే పోతున్నాయి. ఈ వ్య‌వ‌ధి ఇంకా.. మ‌రెన్ని సార్లు పెరుగుతుందో కూడా చెప్ప‌లేకుండా ఉంద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.