Begin typing your search above and press return to search.

మహిళల్లో పెరుగుతున్న కోపం.. సర్వేలో ఏం తేలింది?

By:  Tupaki Desk   |   10 Dec 2022 4:30 AM GMT
మహిళల్లో పెరుగుతున్న కోపం.. సర్వేలో ఏం తేలింది?
X
మహిళల్లో రోజురోజుకు అసహనం.. కోపం పెరిగిపోతున్నాయని అమెరికా కన్సల్టింగ్ రీసెర్చ్ సంస్థ గాలప్ సర్వేలో తాజాగా వెల్లడైంది. గత పదేళ్ల కాలంలో మహిళల్లో క్రమంగా కోపం పెరుగుతూనే విషయం వెలుగులోకి వచ్చిందని గాలిప్ సంస్థ ప్రకటించింది. కరోనా సమయంలో ఇది రెట్టింపు అయిందని వెల్లడించింది.

ఇదే విషయంపై హిప్నోథెరపిస్టు, లైఫ్ కోచ్‌గా పనిచేసే తాషా రెనీ అనే మహిళ తనను తాను ఆత్మ విమర్శ చేసుకుంది. రెండేళ్ల క్రితం వరకు తనకు కోపం అంటే ఏంటో తెలియదని చెప్పింది. అయితే కరోనా కాలంలో కోపం బాగా పెరిగిపోవడాన్ని గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. కరోనా నడుమ ‘ఇక చాలు’ అనే పరిస్థితి వచ్చిందని వాపోయింది.

ఈ సమయంలో తనకు కోపం ఎందుకు వస్తుందనే విషయంపై ఒక జాబితాను రాసుకున్నట్లు చెప్పింది. కోపం వచ్చిన సమయంలో గట్టిగా అరవడం ద్వారా తన కోసం తగ్గినట్లు గుర్తించినట్లు ఆమె వెల్లడించింది. ఇదే విషయంలోపై ప్రపంచంలోని భిన్న ప్రాంతాలకు చెందిన మహిళలతో జూమ్‌ మీటింగులో మాట్లాడి తమకు కోపం ఎందుకు వస్తుందనే విషయాలను తెలుసుకుంటున్నట్లు పేర్కొంది.

అయితే ఇంటా బయటా పెరుగుతున్న ఒత్తిడులే మహిళల్లో కోపం పెరగడానికి కారణమవుతుందని గాలిప్ వరల్డ్ పోల్ గత పదేళ్లలో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రతి యేటా 150కి పైగా దేశాలకు చెందిన ఒక లక్షా 20వేల మందిని గాలప్ సర్వే నిర్వహించి మహిళల భావోద్వేగాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది.

2012 నుంచి పురుషులతో పోలిస్తే మహిళల్లో కోపం.. బాధ.. ఒత్తిడి.. ఆందోళన లాంటి నెగెటివ్ భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇదే సమయంలో పురుషుల్లోనూ గతంతో పోలిస్తే కోపం.. బాధ క్రమంగా పెరిగినట్లు వెల్లడైంది. అయితే మహిళల్లో ఇది కాస్తా ఎక్కువగా ఉందని సర్వేలో వెల్లడైంది.

కరోనా సమయంలో మహిళలు ఇంటికే పరిమితం కావడం వల్ల పని ఒత్తిడి పెరిగిపోవడం కూడా ఒక కారణమని తేలింది. గత పదేళ్లలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగిపోవడం.. ఆర్థిక స్వేచ్చ రావడం.. పురుషాధిక్య సమాజం వంటి భావనలు పెరిగిపోవడం వంటి అంశాలు సైతం మహిళల్లో కోపం పెరగానికి కారణమైనట్లు పలువురు మహిళలు సర్వేలో వెల్లడించారు.

కాగా ఈ సర్వేలో పాల్గొన్న సగం మంది మహిళలు గడిచిన పదేళ్లలో స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగిందని వెల్లడించారు. అమెరికా.. పాకిస్తాన్ లోని సగం మంది మహిళలు తమ జీవిత భాగస్వామితో తమ నిర్ణయాలను పంచుకొని నిర్ణయం తీసుకోవడం సులువైందని తెలిపారు.

ఇక సోషల్ మీడియా తమ జీవితంపై ప్రభావం చూపిందని చాలా దేశాల్లోని మూడింట రెండొంతుల మహిళలు చెప్పారు. అయితే, అమెరికా.. బ్రిటన్లో ఇలా చెబుతున్న మహిళల వాటా 50 శాతం కంటే తక్కువే ఉందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో కోసం ఆయా దేశాలను బట్టి మారుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.

ఏది ఏమైనా గత పదేళ్లలో మహిళల్లో కోపం పెరిగిందని మున్ముందు కూడా ఇలానే కొనసాగే అవకాశం ఉందని సర్వేలో వెల్లడి కావడం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.