Begin typing your search above and press return to search.
అమెరికాలో మరో డేంజర్ బెల్.. పెరుగుతున్న కరోనా కేసులు
By: Tupaki Desk | 16 Dec 2022 7:04 AM GMTకరోనా.. ప్రపంచాన్ని రెండేళ్ల పాటు గుప్పిట పట్టి మరణ మృదంగం వాయించింది. అందరినీ ఇంట్లో కూర్చుండబెట్టింది. అంతటి విలయం తగ్గి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచానికి మరో ఉపద్రవం వచ్చింది. శీతాకాలం రావడంతో వైరస్ లు మరింత యాక్టివ్ అవుతాయి. చల్లటి ప్రదేశంలో వేగంగా విస్తరిస్తాయి. రోగాలను వ్యాపింపచేస్తాయి. ఇప్పుడు చైనాతో సహా అమెరికాలోనూ ఇదే జరుగుతోంది. మళ్లీ అమెరికాలో కరోనా విలయం చోటుచేసుకుంది.
అమెరికా దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు “పెరుగుతున్నాయని” అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆందోళన వ్యక్తం చేశాడు. బిడెన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు అమెరికన్లను ఆందోళనకు గురిచేశాయి. ఎందుకంటే ఇది అమెరికాలోనే అత్యంత పెద్దదైన సెలవుల సీజన్. క్రిస్మస్, న్యూయర్ కోసం అమెరికన్ కుటుంబాలు సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జోబిడెన్ ప్రకటన ఆందోళనకు కారణమవుతోంది. కోవిడ్-19 టెస్టింగ్ కిట్‌లను గృహాలకు పంపే కార్యక్రమాన్ని వైట్ హౌస్ పునఃప్రారంభిస్తోందని జోబిడెన్ ప్రకటించడం కలకలం రేపింది.
బిడెన్ పరిపాలన సీనియర్ అధికారి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, "థాంక్స్ గివింగ్ తరువాత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు మేము గుర్తించాం. కోవిడ్ ఒకప్పుడు అంతరాయం కలిగించే శక్తి కానప్పటికీ, శీతాకాలపు సెలవుల సీజన్ కోసం ప్రజలు ఇంటి లోపల గుమిగూడినందున వైరస్ మరింత త్వరగా.. సులభంగా వ్యాప్తి చెందుతుందని అందరూ జాగ్రత్తగా ఉండాలని" అధికారి తెలిపారు.
అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. వారం వారీ కొత్త కోవిడ్-19 కేసుల ఏడు రోజుల సగటు గత వారం 65,000 కంటే ఎక్కువకు చేరింది. ఇది మునుపటి వారంతో పోలిస్తే దాదాపు 50 శాతం పెరిగడం ఆందోళనకు గురిచేస్తోంది.
డిసెంబర్ 7 నాటికి యునైటెడ్ స్టేట్స్‌లో 99 మిలియన్లకు పైగా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 1.08 మిలియన్ మరణాలు నమోదయ్యాయని డేటా చూపించింది.
కోవిడ్-19తో పాటు మరో రెండు వైరస్‌లు.. ఇన్‌ఫ్లుఎంజా మరియు రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) కూడా అమెరికాలో వ్యాపిస్తోందని అమెరికా సీడీసీ తెలిపింది. న్యూయార్క్ నగరం , లాస్ ఏంజిల్స్ కౌంటీతో సహా అనేక యుఎస్ నగరాలు.. కౌంటీలలోని ప్రజలంతా ఇంటి లోపల ఫేస్ మాస్క్‌లు ధరించాలని ప్రజలను కోరుతున్నాయి. "మేము మరొక కరోనా ఉప్పెన అంచున ఉన్నాము" అని అట్లాంటా, జార్జియాకు చెందిన ప్రజారోగ్య నిపుణులు గురువారం హెచ్చరికలు జారీ చేశారు.
"సెలవు రోజుల్లో ప్రజలు ప్రయాణించేటప్పుడు బాగా సరిపోయే మాస్క్ ధరించడం మంచిదని సూచించారు. ప్రస్తుత శ్వాసకోశ వైరస్‌ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది" అని హెచ్చరికలు పంపారు. మొత్తంగా మరోసారి కరోనా అమెరికన్లను మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.