Begin typing your search above and press return to search.
అఫిషీయల్ గా చైనాలో రోజుకు 3.7 కోట్ల కేసులు.. డ్రాగన్ దేశానికి పెద్ద సమస్యే
By: Tupaki Desk | 24 Dec 2022 3:57 AM GMTనిర్లక్ష్యం.. అంతకు మించిన దాపరికం.. అన్నింటికి మించి మసిపూసి మారేడు కాయలా విషయాన్ని మార్చేద్దామన్న డ్రాగన్ దేశ కక్కుర్తి ప్రపంచానికి శాపంగా మారటం తెలిసిందే. ల్యాబ్ లో తయారు చేసిన అత్యంత ప్రమాదకరమైన కొవిడ్ మహమ్మారికి సంబంధించి చోటు చేసుకున్న తప్పు.. తర్వాతి కాలంలో ఎలాంటి పరిస్థితులకు కారణమైందన్న విషయం తెలిసిందే.
ఇంతకాలం జీరో కొవిడ్ కేసులంటూ అత్యంత అప్రమత్తంగా.. కఠినంగా వ్యవహరించిన చైనా ప్రభుత్వానికి.. కరోనా విషయంలో తాము వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ ఒక్కసారిగా నియంత్రణల్ని ఎత్తి పారేశారు.
అంతే.. రెక్కలు విచ్చుకున్న పక్షి మాదిరి.. కొవిడ్ ఆ దేశంలో వీర విహారం చేస్తోంది. చైనా మొత్తాన్ని కొవిడ్ కమ్మేస్తోంది. ఇదెంత తీవ్రంగా ఉందన్న దానిపై ఇంతవరకు అధికారిక లెక్కలు బయటకు వచ్చింది లేదు. ఆ కొరతను తీరుస్తూ తాజాగా చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తాజాగా అంచనా వేసింది. దీనిప్రకారం చైనాలో ఇప్పుడు రోజుకు 3.7 కోట్ల కేసులు నమోదు అవుతున్నట్లుగా పేర్కొన్నారు.
అంటే.. పది రోజులు గడిస్తే.. కేసుల సంఖ్య 37కోట్లు. అంటే.. దేశంలోని మొత్తం జనాభాలో కరోనా మహ్మమారి ఎంత తీవ్రంగా వ్యాపించిందన్న విషయాన్ని తాజా గణాంకం చెప్పేసే పరిస్థితి. గడిచిన 20 రోజుల్లో దాదాపు 25 కోట్ల మందికి కరోనా వ్యాపించి ఉండి ఉండొచ్చన్న మాటను చెబుతున్నారు. అంటే.. చైనా జనాభాలో దాదాపు 18 శాతం మంది కరోనా కన్ఫర్మ్ అయిన పరిస్థితి.
ఇప్పుడున్న తీవ్రత ఇలానే కొనసాగితే.. ఈ నెలాఖరుకు రోజుకు 3.7 కోట్లకు పైనే కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాప్తి పరిణామంగా మారుతుందని చెప్పాలి. దేశంలో ఎంతగా ప్రయత్నించినా.. కరోనా కేసుల్ని ఆపటం సాధ్యం కాని నేపథ్యంలో.. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అత్యవసరంగా భేటీ అయ్యింది.
కొవిడ్ ను ఎలా అరికట్టాలన్న దానిపై చర్చ జరిగింది. తాజా ఎపిసోడ్ లో చైనా రాజధాని బీజింగ్.. చిచువాన్ ప్రావిన్స్ లోని సౌత్ వెస్ట్ లో సగానికి పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా కరోనా కారణంగా చైనా తీవ్రంగా ప్రభావితం కాగా.. మరోసారి ప్రపంచాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు చైనాలో నెలకొన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.