Begin typing your search above and press return to search.
ఇంక్యుబేషన్ పీరియడ్ 28 రోజులకి పెంచాలి ..అసలు విషయమేంటంటే !
By: Tupaki Desk | 22 April 2020 5:50 AM GMTకరోనా మహమ్మారి .. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తుంది. కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్లో లక్షణాలు కనిపించడానికి 1 నుంచి 14 రోజులు పడుతుందన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క! దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. అలా 14 రోజులు ఐసోలేషన్ లో ఉన్న తరువాత కరోనా నెగటివ్ అని వస్తే ..వారిని ఇంటికి పంపిస్తున్నారు. అయితే, ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. కరోనా లక్షణాలు వైరస్ సోకిన 20 రోజుల తర్వాతే లక్షణాలు బయట పడుతున్నాయి.అందుకే.. కేరళ సర్కారు తమ రాష్ట్రంలో క్వారంటైన్ సమయాన్ని 28 రోజులుగా మార్చింది.
కేరళలో చాలామందికి కరోనా లక్షణాలు 20 తరువాతనే బయటపడుతున్నాయి. కేరళలోని కన్నూర్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి దుబాయ్ నుంచి మనదేశానికి మార్చి 17న వచ్చాడు. 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉన్నాడు. కానీ.. 26 రోజుల తర్వాత అతడికి వైరస్ పాజిటివ్ వచ్చింది. అలాగే.. మార్చి 15న యూఏఈ నుంచి వచ్చిన 11 ఏళ్ల బాలుడికి.. ఏప్రిల్ 8న, అంటే అక్కణ్నుంచి వచ్చిన 24వ రోజున పాజిటివ్ వచ్చింది. కేరళలో ఏకంగా 22 మందికి వైరస్ సోకిన 20 రోజుల తర్వాతే లక్షణాలు బయటపడ్డాయి.
ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నిస్తే .... వైరస్ శరీరంలోకి ప్రవేశించి, స్థిరపడి వ్యాపించడానికి పట్టే సమయం మారింది. డబ్ల్యుహెచ్ వో ప్రకారం వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 5 నుంచి 11 రోజుల మఽధ్య ఉంటుందని భావించాం. కానీ కొందరిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు 14 నుంచి 28 రోజుల మధ్య బయటపడుతున్నాయి. దీనివల్ల లక్షణాలు కనబడకున్నా కేసులు పెరిగిపోతున్నాయి అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడమాలజిస్ట్ కు చెందిన డాక్టర్ నవీన్ వెల్లడించారు.
ఈ వ్యవహారం పై ఐసీఎంఆర్ కూడా దాదాపు 250 పట్టణాల్లో ఓ అధ్యయనం చేసింది. వైరస్ సోకినవారిలో 70 శాతం మందికి 10 నుంచి 18 రోజుల తర్వాతే లక్షణాలు కనబడుతున్నాయని తేల్చింది. కొందరు పేషెంట్లలో 17, 22, 31, 35 రోజుల తర్వాత కూడా లక్షణాలు బయటపడుతున్నాయని మరికొన్ని అధ్యయనాల్లో తేలింది. చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య హఠాత్తుగా పెరగడానికి ఇదే ముఖ్య కారణం అని డాక్టర్ నవీన్ తెలిపారు. చాలా రాష్ట్రాల్లో రెండుసార్లు మాత్రమే పరీక్షలు చేసి కరోనా ఉందొ లేదో నిర్దారిస్తున్నారని , అనుమానితులకు నెలలో మూడుసార్లు పరీక్షలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అయన అభిప్రాయ పడ్డారు. ఈ విషయాన్ని వివిధ రాష్ట్రాలకు తెలియజేశామని.. దీంతో కొన్ని రాష్ట్రాలు ఐసోలేషన్ కాలాన్ని 14 నుంచి 28కి పెంచాయని డాక్టర్ నవీన్ వివరించారు.దేశంలో ఇంకా ఎక్కువ పరీక్షలు చేస్తే కేసులు పెరిగే అవకాశం ఉందని , ‘‘పూల్ టెస్టింగ్, ర్యాండమ్ టెస్టింగ్‌లతో మరిన్ని పాజిటివ్‌లు బయటపడొచ్చు’’ అని అయన తెలిపారు.