Begin typing your search above and press return to search.

పాక్ మ్యాచ్ ను మించిపోయిన 'భారత్-బంగ్లా' ఫైట్

By:  Tupaki Desk   |   3 Nov 2022 10:30 AM GMT
పాక్ మ్యాచ్ ను మించిపోయిన భారత్-బంగ్లా ఫైట్
X
సాధారణం ద్వైపాక్షిక సిరీస్ లలో పాల్గొనని ఇండియా, పాకిస్తాన్ టీంలు ప్రపంచకప్ లలో తలపడితే ఆ మ్యాచ్ ను కోట్ల మంది చూస్తుంటారు. స్టేడియంలో , టీవీల ముందు కొన్ని కోట్ల వీక్షణలు వస్తాయి. భారత్, పాకిస్తాన్ వంటి శత్రుదేశాలు యుద్ధం చేస్తున్నట్టే మైదానంలో ఆడుతుంటాయి. అయితే ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ తో మ్యాచ్ కంటే కూడా బంగ్లాదేశ్ తో టీమిండియా మ్యాచ్ మించిపోయింది.

నిన్న అడిలైడ్ లో టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన కీలకమైన భారత్-బంగ్లాదేశ్  మ్యాచ్ టోర్నీలోనే డిజిటల్ ప్రసారం చేసిన డిస్నీ +హాట్ స్టార్  చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ  మ్యాచ్ హాట్ స్టార్ హిస్టరీలోనే నమోదైన అన్ని రికార్డులను తిరగరాసింది.

హాట్ స్టార్ పెయిడ్ వెర్షన్ గా మారాక అత్యధిక వ్యూస్ సంపాదించుకున్న మ్యాచ్ గా భారత్-బంగ్లా మ్యాచ్ నిలిచి రికార్డుల్లోకి ఎక్కింది. ఈ మ్యాచ్ ను హాట్ స్టార్ లో ఒకానొక సమయంలో ేకంగా 19 మిలియన్ల మంది చూడడం రికార్డ్ గా చెప్పొచ్చు. హాట్ స్టార్ చరిత్రలోనే ఇదే అత్యధిక వ్యూయర్ షిప్ గా రికార్డ్ అయ్యింది.

ఈ మ్యాచ్ కు ముందు ఇదే వరల్డ్ కప్ లో జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు దాదాపు 18 మిలియన్ల మంది వీక్షించారు. ఇప్పటివరకూ ఇదే రికార్డ్ కానీ.. బంగ్లాదేశ్ తో టీమిండియా మ్యాచ్ రికార్డులు బద్దలు కొట్టింది.

ఇక హాట్ స్టార్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్ షిప్ దక్కించుకున్న మ్యాచ్ ల జాబితాలో మూడో స్థానంలో కూడా భారత్ ఆడిన మ్యాచ్ లే ఉండడం విశేషం.

ఇక ఇంతకుముందు ఆసియాకప్ 2022లో భారత్ -పాక్ మ్యాచ్ ను 14 మిలియన్ల మంది చూశారు. అయితే నిన్న జరిగిన భారత్ -బంగ్లా మ్యాచ్ నరాలు తెగ ఉత్కంఠ మధ్య సాగింది. చివరి నిమిషం వరకూ నువ్వా నేనా అన్నట్టుగా రెండు జట్లు పోరాడాయి. క్రికెట్ లవర్స్ కు అసలు సిసలు మజాను అందించింది. అందుకే చాలా మంది ఈ మ్యాచ్ ను చూడడంతో అన్ని వ్యూస్ వచ్చాయి. భారత్, పాక్ మ్యాచ్ కంటే కూడా అత్యధిక వ్యూయర్ షిప్ దక్కించుకుంది.

భారత్ పై ఒకానొక దశలో బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ దెబ్బకు ఆ జట్టు గెలిచేలా కనిపించింది. అయితే వర్షం అంతరాయం కలగడంతో బంగ్లాదేశ్ వరుస వికెట్లు కోల్పోయి ఓడిపోయింది. సెమీస్ బెర్త్ దక్కాలంటే ఇరు జట్లు ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో బంగ్లా, భారత్ హోరాహోరీ పోరాడాయి. ఈ క్రమంలోనే అత్యధిక వ్యూయర్ షిప్ సాధించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.