Begin typing your search above and press return to search.
భారత్-పాక్ మ్యాచ్.. యాడ్ పై విమర్శల వర్షం
By: Tupaki Desk | 11 Jun 2019 3:30 PM GMTభారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ప్రేక్షకాదరణ భారీగానే ఉంటుంది. అలాంటిది ప్రపంచకప్ లాంటి వేదికపైన అయితే.. బాబాయ్.. దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అనగానే దేశాలతో సంబంధం లేని క్రికెట్ ప్రేమికులు సైతం ఎగబడి మరీ టికెట్లు కొనగోలు చేస్తుంటారు. ఇక, భారత్ - పాక్ దేశాలకు సంబంధించిన వారైతే ఈ మ్యాచ్ ను చూసేందుకు అమితమైన ఆసక్తిని చూపుతుంటారు. ఇంతటి క్రేజ్ ఉంది కాబట్టే ఈ మ్యాచ్ ప్రత్యేకంగా నిలుస్తూ వస్తోంది.
దాయాదీ దేశాల మధ్య పోరును క్యాష్ చేసుకోడానికి అటు ఐసీసీ.. ఇటు ప్రసార హక్కులు పొందిన చానెల్ ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటాయి. ఈ మ్యాచ్‌కు ఐసీసీ టికెట్ ధరలను భారీగా పెంచుతూ వస్తోంది. ఇక, మ్యాచ్ హక్కులు పొందిన చానెల్ అయితే - యాడ్స్ రూపంలో భారీగా లాభాన్ని అర్జిస్తుంది. అందుకే భారత్ - పాక్ మ్యాచ్ అనగానే కొంత ఎక్కువ శ్రద్ధ పెడుతుంటుంది చానెల్ యాజమాన్యం. ఇందులో భాగంగానే ఈ మ్యాచ్ జరగడానికి కొద్దిరోజులు ముందు నుంచే యాడ్స్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా రూపొందిందే ‘మౌకా-మౌకా’ యాడ్.
భారత్ - పాక్ మధ్య జరిగే మ్యాచ్ కోసం స్టార్ స్పోర్ట్స్ చానెల్ గతంలో ‘మౌకా-మౌకా’ అనే యాడ్ రూపొందించింది. ఇది సందర్భాన్ని బట్టి మారుతూ వచ్చింది. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్ ను ఉద్దేశించి సదరు చానెల్ మరో యాడ్ ను తయారు చేయించింది. అయితే, ఈ సారి ఫాదర్స్ డేన జరగనున్న నేపథ్యంలో దీనికి ఆ తరహా డైలాగులు కలిపి వదిలారు. దీంతో ఈ యాడ్ కొద్ది సమయంలోనే వైరల్ అయిపోయింది. గతంతో పోలిస్తే ఇందులో కొంత అతి కనిపిస్తోంది. దీంతో ఇరు దేశాలకు చెందిన నెటిజన్లు ఈ యాడ్‌పై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.
గతంలో పాక్.. భారత్ చేతిలో ఆరు సార్లు ఓటమి పాలైంది. 1992 నుంచి వరుసగా ఆ జట్టు ఓడిపోతూనే వస్తుంది. 1992 - 1996 - 1999 - 2003 - 2011 - 2015 ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అన్నింటిలోనూ టీమిండియానే విజయం సాధించింది. 2007 ప్రపంచకప్ లో మాత్రం రెండు జట్లు వేరు వేరు గ్రూపుల నుంచి తలపడి - అదే దశలో ఇంటికి వెళ్లిపోయాయి. గత ఫలితాలను గుర్తు చేసుకుంటూ చెప్పిన డైలాగులతో రూపొందించిన ‘మౌకా-మౌకా’ యాడ్ పై సెటైర్లు పేలుతున్నాయి. దీన్ని రూపొందించిన స్టార్ స్పోర్ట్స్ చానెల్ పై పలువురు విరుచుకుపడుతున్నారు.