Begin typing your search above and press return to search.
మంత్రి పదవికి రాజీనామా.. బీజేపీకి జై
By: Tupaki Desk | 8 July 2019 7:47 AM GMTకన్నడ పీఠాన్ని తమ సొంతం చేసుకోవటం కోసం మోడీషాలు గతంలోనే పలుమార్లు ఆపరేషన్ కమల చేపట్టటం.. అది పెద్దగా వర్క్ వుట్ కాకపోవటం తెలిసిందే. పలుసార్లు ఫెయిల్ అయిన తర్వాత.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో కమలనాథులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకోవటం ద్వారా కన్నడిగులు తమ వెంటే ఉన్నారన్న విషయాన్ని గుర్తించిన బీజేపీ అధినాయకత్వం అధికారమార్పిడికి కోసం పావులు కదుపుతోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే పలు పరిణామాలు చోటు చేసుకుంటూ.. కుమారస్వామి ప్రభుత్వం వెంటిలేటర్ మీదకు చేరిన దుస్థితి. తాజా పరిణామాలతో అమెరికా నుంచి హుటాహుటిగా వచ్చినప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికి తగిలిన షాకులు సరిపోదన్నట్లుగా తాజాగా సీఎం కుమారస్వామికి మంత్రి నగేశ్ భారీ షాకిచ్చారు.
స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రి పదవిని చేపట్టటం ద్వారా ప్రభుత్వంలో చేరిన నగేశ్.. తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ కు తన లేఖను అందజేశారు. అంతేకాదు.. తనను బీజేపీ ఆహ్వానించిన పక్షంలో ఆ పార్టీలో చేరతానన్న విషయాన్నిచెప్పటం ద్వారా తానేం చేయాలనుకుంటున్నది చెప్పేశారు. దీంతో.. కుమారస్వామికి సొంతపార్టీ నుంచే కాదు.. మిత్రపక్షంతో పాటు.. తనకు దన్నుగా నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ దారిన తాము వెళ్లేందుకు సిద్ధమైన వేళ.. నగేశ్ ఎపిసోడ్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాలు చూస్తే.. కర్ణాటకలో అధికార బదిలీ ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు.