Begin typing your search above and press return to search.
బీజేపీకి షాక్ ఇచ్చిన స్వతంత్ర్య ఎమ్మెల్యే..
By: Tupaki Desk | 17 May 2018 10:08 AM GMTకర్ణాటక బీజేపీ వశమైంది. యడ్యూరప్ప బీజేపీ సీఎంగా గద్దెనెక్కారు. అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ 15రోజుల గడువు ఇవ్వడంతో బీజేపీ బేరసారాలకు తెరదీసింది. కొత్త ఎమ్మెల్యేలను లాక్కునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్ర్య అభ్యర్థులకు ఎరవేస్తోంది. ఇలా ఓ ఎమ్మెల్యే బీజేపీకి చిక్కినట్టే చిక్కి హ్యాండ్ ఇచ్చారు. దీంతో అవాక్కవడం బీజేపీ వంతైంది.
మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రధాన అనుచరుడు, స్వతంత్ర్య ఎమ్మెల్యే శంకర్ బీజేపీకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. బుధవారం ఉదయం బీజేపీ పంచన చేరిన ఎమ్మెల్యే శంకర్ సాయంత్రానికి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆశించిన శంకర్ చివరకు రాకపోవడంతో సిద్దరామయ్యతో విభేదించి ఒంటరిగా పోటీ చేసి గెలుపొందాడు. అయితే ఎమ్మెల్యేల వేటలో ఉన్న బీజేపీ శంకర్ ను మద్దతివ్వాలని ప్రలోభ పెట్టింది. దీనికి ఒకే చెప్పిన శంకర్ ఆఖరి నిమిషంలో సిద్ధరామయ్య కోరిక మేరకు కాంగ్రెస్ లో చేరారు.
ఇలా కన్నడనాట కప్పుదాట్లు ఎక్కువైపోయాయి. ఎవ్వరూ ఎక్కువ డబ్బులిస్తే.. ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ వాలిపోతున్నారు. పార్టీలు, జెండాలు పక్కనపడేసి.. నచ్చిన కండువాలను క్షణాల్లో కప్పుకుంటున్నారు. ఇలానే కొనసాగితే... మరో 15రోజుల్లో జరిగే బలనిరూపణలో ఎవరు ఎవరికి మద్దతిస్తారనేది ఆసక్తిగా మారింది. బీజేపీ ప్రభుత్వం నిలబడుతుందా.. పడిపోతుందా అన్నది ఆసక్తిగా మారింది.