Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్: ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిదంటే?

By:  Tupaki Desk   |   29 April 2021 3:52 PM GMT
ఎగ్జిట్ పోల్స్: ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిదంటే?
X
దేశవ్యాప్తంగా రెండు నెలలుగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రహసనం ముగిసింది. కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని తీర్పునిచ్చారు. మే 2వ తేదీన అధికారికంగా ఓట్ల లెక్కింపు ద్వారా విజేతలు ఎవరు అనేది తేలనుంది.

అయితే ఈరోజు సాయంత్రంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది.బెంగాల్ లో చివరి విడత పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ పోటెత్తాయి.

పశ్చిమ బెంగాల్ లో 294, తమిళనాడులో 234, అసోం 126, కేరళ 140, పుదుచ్చేరి 30 రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో గెలుపు ఎవరిది అనే విషయంపై పలు మీడియా, సర్వే సంస్థలు ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

‘‘ఓవరాల్ గా చూస్తే పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మూడోసారిగెలిచి హ్యాట్రిక్ కొట్టనుంది. ఇక తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ అధికారంలోకి రానున్నారు. కేరళలో అధికార కమ్యూనిస్టు కూటమి ఎల్డీఎఫ్ మరోసారి విజయం సాధిస్తుంది. అసోం, పుదుచ్చేరిలో బీజేపీ విజయం సాధించనుంది’’.

మొత్తంగా బీజేపీ ఖాతాలోకి అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలు చేరనున్నాయి. తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ విజయం సాధిస్తాయి. కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారు. బెంగాల్ లో మమత హ్యాట్రిక్ కొడుతారు. జాతీయ పార్టీల పరంగా చూస్తే బీజేపీకి 2 రాష్ట్రాలు, కాంగ్రెస్ కు 1, కమ్యూనిస్టులకు 1, ప్రాంతీయ పార్టీ టీఎంసీకి 1 రాష్ట్రం దక్కనుంది.
--------------------------------------------------

-బెంగాల్ మమతదే.. బీజేపీ టఫ్ ఫైట్
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో బెంగాల్ లో మమతను ఓడించడానికి బీజేపీ సామధాన బేధ దండోపాయాలు రచించింది. చాలా హింస, పలువురి మరణం కూడా ఈ ఎన్నికల్లో సంభవించింది. టీఎంసీ, బీజేపీ కొదమ సింహాల్లో తలపడ్డాయి. అయితే మమతను గద్దెదించాలనుకున్న బీజేపీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. మెగాజర్టీ ఎగ్జిట్ పోల్స్ లో మమతా బెనర్జీనే గెలుస్తుందని అంచనావేశాయి. బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇస్తుందని తేల్చాయి. స్వల్పతేడాతోనే బీజేపీ గెలవనుంది.

- పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు: (292 అసెంబ్లీ సీట్లు)

- సిఎన్ఎన్ +న్యూస్ 18
టిఎంసి -162
బిజెపి -115
కాంగ్రెస్-వామపక్ష కూటమి -15

- రిపబ్లిక్ టీవీ-సిఎన్ఎక్స్
టిఎంసి -128-138
బిజెపి -138-148
కాంగ్రెస్-వామపక్ష కూటమి -11-21

-ఎబిపి + సి-ఓటర్
టిఎంసి: 152-164
బిజెపి: 109-121
కాంగ్రెస్-వామపక్ష కూటమి: 14-25

- పి-మార్క్
టిఎంసి -152-172
బిజెపి -112-132
కాంగ్రెస్-వామపక్ష కూటమి -10-20

-ఈటీజీ సర్వే సంస్థ
టిఎంసి -164-176
బిజెపి -105-115
కాంగ్రెస్-వామపక్ష కూటమి -10-15

---------------------------------------

- తమిళనాడు స్టాలిన్ కు.. (అసెంబ్లీ స్థానాలు 234)
కరుణానిధి, జయలలిత లేకుండా తమిళనాడు ఎన్నికలు సాగాయి. రజినీకాంత్ మధ్యలోనే డ్రాప్ కాగా.. శశికళ ఎగ్జిట్ అయిపోయింది. దీంతో తమిళనాడులో స్టాలిన్ కింగ్ మేకర్ గా నిలిచాడు. తమిళనాడు ప్రజలు ఈసారి డీఎంకే అధినేత స్టాలిన్ కే పట్టం కట్టనున్నారని తేలింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ స్టాలిన్ గెలుస్తాడని ప్రకటించాయి.

– టూడేస్‌ చాణక్య ఎగ్జిల్‌ పోల్స్‌
డీఎంకే – 164-186
అన్నాడీఎంకే – 46-68
ఇతరులు – 0-6

– సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌
డీఎంకే – 160-170
అన్నాడీఎంకే – 58-68
ఏఎంఎంకే – 4-6
ఇతరులు – 0

- రిపబ్లిక్‌ టీవీ
డీఎంకే – 160-170
ఏడీఎంకే – 58-68
ఇతరులు – 0

- సి-ఓటరు ఎగ్జిల్‌ పోల్స్‌
ఏడీఎంకే – 58-70
డీఎంకే – 160-172
ఏఎంఎంకే – 0
ఇతరులు – 0-7

– ఇండియా టుడే ఎగ్జిల్‌ పోల్స్‌
డీఎంకే – 175-195
అన్నాడీఎంకే -38-54
ఇతరులు – 1-9
----------------------------------------------

-కేరళ కమ్యూనిస్టులదే.. (140 అసెంబ్లీ స్తానాలు)
కేరళలో అధికార కమ్యూనిస్టు కూటమి ఎల్డీఎఫ్ మరోసారి గెలుస్తుందని మెజార్టీ సర్వేలు చెప్పుకొచ్చాయి.

- టైమ్స్‌ ఇండియా ఎగ్జిల్‌ పోల్స్‌
ఎల్‌డీఎఫ్‌ 76
యూడీఎఫ్‌ 61
బీజేపీ 3

- ఆర్‌ఇండియా-సిఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్ పోల్స్
ఎల్‌డీఎఫ్‌ – 72-80
కాంగ్రెస్‌ – 58-64
బీజేపీ – 1-5
ఇతరులు – 0

– ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు
ఎల్‌డీఎఫ్‌ – 104-120
కాంగ్రెస్‌ – 20-36
బీజేపీ – 0-2
ఇతరులు – 0
---------------------------------------

-అస్సాం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు (120 అసెంబ్లీ స్థానాలు)

-ఎబిపి-సి ఓటరు
ఎన్డీఏ: 58-71
కాంగ్రెస్ +: 53-66
ఇతరులు: 0-5

* పి-మార్క్
బిజెపి కూటమి -62-70
కాంగ్ కూటమి -56-64
ఇతరులు -0-4

* ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా
బిజెపి కూటమి -75-85
కాంగ్ కూటమి -40-50
ఇతరులు -1-4

*రిపబ్లిక్ టీవీ-సిఎన్ఎక్స్
బిజెపి కూటమి -74-84
కాంగ్ కూటమి -40-50
ఇతరులు -1-3
----------------------------------
-పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్ .. బీజేపీదే హవా (30 అసెంబ్లీ స్థానాలు)

– సిఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు
కాంగ్రెస్‌ – 11-13
బీజేపీ – 16-20
ఏఎంఎంకే -0
ఇతరులు -0

- రిపబ్లిక్‌ టీవీ
ఎన్‌డీఏ – 16-20 సీట్లు
యూపీఏ – 11-13 సీట్లు
ఇతరులు – 0