Begin typing your search above and press return to search.
ట్రంప్ మాట: భారతీయులు భలే బేరాలాడతారు
By: Tupaki Desk | 14 Nov 2018 7:24 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఏ అంశం మీదైనా స్పందించే తీరు చిత్రంగా ఉంటుంది. ఆయన కొంచెం ఓపెన్ టైపు. వివిధ దేశాల మీద ఆయన అభిప్రాయాలు నిక్కచ్చిగా ఉంటుంటాయి. కొన్నిసార్లు అమెరికా అధ్యక్షుడిలా కాకుండా.. ఒక మామూలు వ్యక్తిలా తన అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. తాజాగా ట్రంప్.. భారతీయుల మనస్తత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్స్ భలేగా బేరాలాడతారని ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం.
తాజాగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ట్రంప్ పాల్గొనడం విశేషం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక, దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఇది రెండోసారి. దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్న ట్రంప్.. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. చారిత్రక రూజ్‌వెల్ట్ రూంలో దీపం వెలిగించి దీపావళి వేడుకల్ని ప్రారంభించిన అనంతరం ఇండియాతో సంబంధాల గురించి ట్రంప్ మాట్లాడారు.
ఇండియాతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం అంత తేలిక కాదన్న ట్రంప్... భారతీయులు గీచి గీచి బేరాలాడతారని చమత్కరించారు. ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని.. అలాంటి దేశంతో అమెరికా సంబంధాలు ప్రపంచ శాంతికి.. అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. అమెరికా ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ట్రంప్.. భారతీయులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తి నుంచి ఇప్పుడు ఇలాంటి మాటలు రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.