Begin typing your search above and press return to search.

చైనాకు చెక్:జపాన్ - ఆస్ట్రేలియా - అమెరికాతో భారత్ కూటమి

By:  Tupaki Desk   |   29 Sep 2020 5:30 PM GMT
చైనాకు చెక్:జపాన్ - ఆస్ట్రేలియా - అమెరికాతో భారత్ కూటమి
X
కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటించి కోట్ల మంది ప్రాణాలు తీయడమే కాకుండా.. సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలుదూస్తున్న చైనాకు గట్టి షాకిచ్చేలా భారత్ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ‘చతుర్భుజ కూటమి’ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.

చైనా దురుసు ప్రవర్తనతో ఇప్పటికే పలు దేశాలతో వైరం పెట్టుకుంది. జపాన్, భారత్, ఆస్ట్రేలియా, అమెరికాలతో కయ్యానికి కాలుదువ్వుతోంది. దీంతో ఆ దేశాలను ఏకతాటిపైకి తెచ్చి చైనాను కట్టడి చేసే వ్యూహానికి భారత్ పదును పెడుతోంది. ఈ క్రమంలోనే నాలుగుదేశాలతో ‘చతుర్భుజ కూటమి’ని భారత్ ఏర్పాటు చేయతలపెట్టింది.

ఈ క్రమంలోనే భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్(క్వాడ్) దేశాల విదేశాంగ మంత్రులు వచ్చే నెల జపాన్ లోని టోక్యోలో భేటికి నిర్ణయించారు. ఈ నాలుగుదేశాల సంయుక్త సమస్యలపై చర్చిస్తారు. ఈ భేటికి భారత విదేశాంగ మంత్రి నేరుగా హాజరు కానున్నారు.

ప్రధానంగా దక్షిణ చైనా సముద్రం సహా ఇండో-పసిఫిక్ లో చైనా ఆధిపత్యం ఎలా చెక్ పెట్టాలన్న అంశంపై చర్చిస్తారు. క్వాడ్ ఏర్పాటుకు అమెరికా దూకుడు వైఖరి చైనాను ఆందోళనకు గురిచేస్తోంది.

అమెరికా ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా చైనాను దెబ్బకొట్టేందుకు క్వాడ్ బృందాన్ని ట్రంప్ ఏర్పాటు చేసి దూకుడుగా వెళ్లాలని నిర్ణయించారు. డ్రాగన్ దూకుడు తగ్గించాలని ఆయన నిర్ణయించారు.

అయితే ఇండో-పసిఫిక్ వ్యూహం భారత్ కేంద్రంగా తయారైందే.. హిందూ మహాసముద్రంలో భారత్ తిరుగులేని శక్తి. మిగిలిన దేశాలు భారత్ తో కలిసి ఇప్పుడు చైనా పీచమణిచేలా ముందుకు వచ్చాయి. జపాన్ కొత్త ప్రధాని యషిహిడు సుగా కూడా ఈ క్వాడ్ ఏర్పాటుకు ఉత్సాహం చూపిస్తున్నారు. జపాన్-భారత్ సత్సంబంధాలతో ముందుకెళుతుండడం.. అమెరికా, ఆస్ట్రేలియా కలిసి రావడం చైనాకు మింగుడుపడని వ్యవహారంగా మారింది.