Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టు రద్దు .. కారణం ఇదే
By: Tupaki Desk | 10 Sep 2021 8:38 AM GMTభారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్ట్ రద్దు అయ్యింది. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. జట్టు శిబిరంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో టీమిండియా ప్లేయర్స్ ఆటపై విముఖత చూపిస్తున్నారు. వారిని నిర్ణయాన్ని గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ వెల్లడించారు. ఒకవేళ మ్యాచ్ ఆలస్యమైతే.. ఐపీఎల్ షెడ్యూల్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.
గురువారం జరిపిన కరోనా టెస్టుల్లో టీమిండియా ఆటగాళ్లకు నెగిటివ్ వచ్చినప్పటికీ, కొంతమంది ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయా ప్లేయర్స్ బీసీసీఐ లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారట. దీనితో అటు బీసీసీఐ, ఇటు ఈసీబీ టెస్ట్ మ్యాచ్ పై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక తాజాగా టీమిండియా ప్లేయర్స్‌కు మరోసారి కరోనా టెస్టులు నిర్వహించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్నాయట. ఇదిలా ఉంటే ఇప్పటికే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తో పాటు ఫిజియో, ఇతర సహాయక సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారందరూ క్వారంటైన్‌లో ఉన్నారు.
బయో బబుల్ దాటి పుస్తక ఆవిష్కరణకు వెళ్లడంపై కూడా ఈసీబీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయంపై తాము విచారణ ప్రారంభించామని బీసీసీఐ తెలిపింది. ఈ మొత్తం ఘటన ఇరు బోర్డుల మధ్య విభేదాలకు దారి తీసింది. దీనితో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 2-1తో విజయం సాధించింది.
నాలుగు టెస్టుకు ముందు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రీతో పాటు మరికొందరు సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో వారు ఆ టెస్టుకు దూరం అయ్యారు. ఆ తర్వాత తాజాగా మరో సహాయక సిబ్బందికి కరోనా సోకింది. దాంతో గురువారం జట్టు సభ్యులందరికీ కరోనా టెస్టు నిర్వహించారు. సభ్యులందరకీ నెగెటివ్ రావడంతో మ్యాచ్ కు మార్గం సుగమమైందని భావించారు. కానీ, చివరి నిమిషంలో ఇరు జట్లు తొలి రోజు ఆటను రద్దు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇరు జట్ల బోర్డులు కూడా అంగీకరించాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు ఈసీబీ ప్రకటించింది.