Begin typing your search above and press return to search.

చైనాకు బుద్ధి చెప్పేందుకు సర్వం సిద్ధం : భారత్ ఆర్మీ !

By:  Tupaki Desk   |   30 Jun 2020 11:50 AM GMT
చైనాకు బుద్ధి చెప్పేందుకు సర్వం సిద్ధం : భారత్ ఆర్మీ !
X
భారత్ - చైనా మధ్య రోజురోజుకి ఉద్రిక్తత మరింతగా పెరిగిపోతుంది. ఓ వైపు శాంతి చర్చల ద్వారానే చైనాతో సరిహద్దు సమస్య పరిష్కరించుకోవాలని భావిస్తున్న భారత్... మరోవైపు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేస్తుంది. చర్చలు జరుగుతున్న వేళ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడటం, భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చే ప్రయత్నాలు చేయడం వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా తమ బలగాలను ఇతర మిలటరీ వ్యవస్థలను మోహరించడం చేస్తోంది.

ముందుగా శాంతి మంత్రంను పాటించాలని భావిస్తున్న భారత్.. పరిస్థితుల్లో తేడా వస్తే యుద్ధానికి సిద్ధం అని సంకేతాలు కూడా పంపుతోంది. ఇందులో భాగంగానే భారత ఆర్మీ ఆరు యుద్ధ ట్యాంకర్లను సరిహద్దుల్లో మోహరించింది. గాల్వాన్ వ్యాలీలో T-90 క్షిపణి ట్యాంకర్లను మోహరించింది. ఇక సరిహద్దుల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తమ బలగాలను పెంచడంతో ఆర్మీ T-90 భీష్మా ట్యాంకర్లను మోహరించింది. గాల్వాన్ నదీ తీరంలో చైనా గుడారాలు, మిలటరీ బలగాలు ఇతర మిలటరీ సామగ్రిని మోహరించింది. తూర్పు లడఖ్‌లోని 1597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంట యుద్ధ వాహనాలను భారత్ మోహరించింది.

అంతేకాదు స్పాంగూర్ గ్యాప్ ద్వారా భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న చైనాను అడ్డుకునేందుకు వారి ప్రణాళికలను దెబ్బతీసేందుకు చుషుల్ సెక్టార్ ‌లో రెండు ట్యాంక్ రెజిమెంట్లను భారత్ మోహరించింది. ఈ సెక్టార్ పైనే కన్నేసిన చైనా కంట్రీ చర్చల్లో భాగంగా ఈ ప్రాంతాన్ని అప్పగించాలని భారత్‌ ను కోరి ఆ పై తన బలగాలను వెనక్కు రప్పించుకునే ప్రయత్నం చేస్తోంది చైనా. ఒకవేళ యుద్ధమే వస్తే భారత్ అన్ని విధాల సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే పీపుల్ లిబరేషన్ ఆర్మీకి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు అక్కడికి మార్షల్ ఆర్ట్స్ నిపుణులను పంపింది చైనా. అయితే చైనా ఎన్నిచేసిన భారత జవాన్లను ఏమీ చేయలేదనే ధీమా భారత ఆర్మీ వ్యక్తం చేస్తోంది. సాధారణంగా భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో చైనా బలగాలు రెండేళ్ల పాటు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత కొత్త బలగాలు వస్తాయి. అయితే భారత్ విషయంలో అలా కాదు. 17 ఏళ్ల పాటు బలగాలు అక్కడ మోహరించి ఉంటాయి కాబట్టి జవాన్లు ఆ వాతావరణంకు అలవాటు పడిపోయి ఉంటారని భారత్ చెబుతోంది.

సియాచిన్ గ్లేసియర్ ‌ను తనలో కలిపేసుకునేందుకు 1984లో పాకిస్తాన్ తీవ్ర ప్రయత్నం చేసి భారత్ దెబ్బకు వెనకడుగు వేసింది. ఇక కార్గిల్‌ ప్రాంతం కూడా 15000 అడుగుల ఎత్తులో ఉంది. నాడు కార్గిల్ యుద్ధంలో కూడా భారత్ విజయం సాధించిందని భారత ఆర్మీ గుర్తు చేస్తోంది. భారత భూభాగంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నించిన శతృదేశాలకు భారత్ ఎన్నో సార్లు ధీటైన జవాబు చెప్పిన అనుభవం ఉంది. ప్రస్తుతం చైనాకు కూడా అదే స్థాయిలో బుద్ధి చెబుతామని అందుకు సైన్యం సన్నద్ధంగా ఉందని భారత ఆర్మీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.