Begin typing your search above and press return to search.
ఆకలి సూచీ లో అట్టడుగున భారత్.. పాక్ కంటే కూడా దారుణం
By: Tupaki Desk | 16 April 2022 9:28 AM GMTప్రపంచ ఆకలి సూచీలో భారత దేశం అతి ఘోరమైన ప్లేసులో నిలిచింది. తీవ్రమైన ఆకలి బాధలున్న దేశాల విభాగంలో భారత్ కూడా ఒకటిగా ఉంది. పొరుగు దేశాలైనా పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే కూడా భారత్ దిగువన ఉండటం గమనార్హం. తాజాగా, 116 దేశాల జాబితాతో వెలువడి ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 101వ స్థానంలో ఉంది.
దేశంలో పౌరులందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వడం లేదని ప్రపంచ ఆకలి సూచీ 2021 స్పష్టం చేసింది. దేశంలో ఆహార నిల్వలు భారీగానే ఉన్నప్పటికీ ఆకలి బాధ, పోషకాహార లోపాలు వంటివి చిన్నారులనూ వెంటాడుతూనే ఉన్నాయి. పొరుగు దేశాలు బంగ్లాదేశ్ ఆకలి సూచీలో 76వ స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ 92వ స్థానంలో ఉంది. ఈ రెండు పొరుగు దేశాలు ఇదే విభాగంలో ఉన్నప్పటికీ మన కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి.
గతేడాది ప్రపంచ ఆకలి సూచీ లో 107 దేశాల జాబితాలో మన దేశం 94వ స్థానంలో నిలిచింది. ఆకలి బాధ నివారణలో గతేడాది 93 దేశాలు మనకన్నా అగ్రభాగాన ఉంటే... ఈ ఏడాది అటు వంటి దేశాల సంఖ్య 100కి పెరిగింది. అంటే భారత్ ఆకలి సూచీలో మరింతగా దిగజారింది. పర్యవేక్షణ కొరవడటం, పోషకాహార లోపాలను సరిదిద్దలేకపోవడం వంటిని మన దేశం వెనకబాటుకు కారణాలుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
హంగర్ ఇండెక్స్ లో చైనా, కువైట్, బ్రెజిల్ తదితర 18 దేశాలు సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలోని చిన్నారుల్లో ఎత్తుకు తగిన బరువు లేని వారి శాతం 1998-2002 మధ్య 17.1 గా ఉండగా.. 2016-2020 మధ్య ఈ సంఖ్య 17.3 కి పెరిగిందని తెలిపింది ప్రస్తుత గణాంకాల ప్రకారం 2030 నాటికి కూడా 47 దేశాలు తీవ్ర పోషకాహార సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపింది.
కరోనాతో విధించిన లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిందని హంగర్ ఇండెక్స్ పేర్కొంది. పౌష్టికాహార లోపం, చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, వయసుకు తగిన బరువు లేకపోవడం, శిశు మరణాల రేటును పరిగణనలోకి తీసుకుని నివేదికను తయారు చేశారు.
జీహెచ్ఐ స్కోరు 2000లో 38.8 శాతం ఉండగా 2012కి 28.8 శాతానికి, 2021కి 27.5 శాతానికి తగ్గింది. అయితే, భారత్ లో ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాల రేటు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. సరిపడా ఆహారం కారణంగా పోషకాహార లోపం వంటి ఇతర సూచికల్లో భారత దేశం మెరుగుదల చూపించింది.