Begin typing your search above and press return to search.
పాక్ కు విశ్వరూపం చూపించిన భారత ఆర్మీ
By: Tupaki Desk | 4 Jan 2018 10:20 AM GMTగడిచిన కొన్ని నెలలుగా భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంత సహనంగా..ఓర్పుతో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు దొంగ దెబ్బలు తీస్తున్న పాక్ వైఖరిపై భారత్ సైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. తాజాగా బర్త్ డే జరుపుకున్న భారత్ జవాను ఆర్పీ హజ్రాను పాక్ సైనిక మూకలు దొంగ దెబ్బలు తీశాయి. ఆయన ప్రాణాలు పోయేలా చేశాయి.
పుట్టినరోజు వేడుకలు చేసుకున్న సైనికుడి ప్రాణాలు పోవటంపై భారత ఆర్మీ రగిలిపోయింది. దాయాది పాక్ కు విశ్వరూపాన్ని ప్రదర్శించింది. పాకిస్థాన్ పోస్టుల్ని ధ్వంసం చేయటమే కాదు.. దాదాపుగా డజను మంది పాక్ సైనికుల్ని హతమార్చినట్లుగా తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ లోని సాంబ సెక్టార్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం పాక్ కు చెందిన పన్నెండు మందికి పైగా సైనికుల ప్రాణాల్ని తీసేలా చేసింది.
భీకర కాల్పులతో పాటు పాకిస్థాన్ కు చెందిన మోర్టార్ పొజిషన్లను పసిగట్టి రాత్రికి రాత్రే నేలకూల్చాయి. అర్థరాత్రి వేళ బీఎస్ ఎఫ్ జరిపిన కాల్పుల్లో 12 మంది నుంచి 15 మంది వరకూ పాక్ సైనికులు మృతి చెంది ఉంటారని చెబుతున్నారు. మొదట తేలికపాటి ఆయుధాలతో కాల్పులు దిగిన పాక్.. తర్వాత మోర్టార్ షెల్స్ ను వాడటం షురూ చేసింది. దీంతో బీఎస్ ఎఫ్ దళాలన్నీ ఒక్కసారి పొజిషన్లోకి వచ్చేసి మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు.
దీంతో.. పాక్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు 12 మంది నుంచి 15 మంది వరకు పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయి ఉంటారని తెలుస్తోంది. ఈ పరిణామం పాక్ కు షాకింగ్ గా మారిందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారత్ సైనికులు ఇంత తీవ్రంగా రియాక్ట్ అయ్యింది ఇప్పుడేనన్న మాట వినిపిస్తోంది.