Begin typing your search above and press return to search.

కరోనా భయం : 42 వేల చెట్లు నరికివేత ..ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   14 April 2020 10:30 PM GMT
కరోనా భయం : 42 వేల చెట్లు నరికివేత ..ఎక్కడంటే ?
X
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న క్ర‌మంలో జమ్ముక‌శ్మీర్‌లో వేల చెట్లను నరికేయడానికి అక్క‌డి అధికారులు నిర్ణ‌యించారు. దాదాపు 42 వేల‌ ఆడ పోప్లార చెట్లను నరికివేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. రుస్సీ ఫ్రాస్‌గా పిలువబడే పోప్లార్ చెట్లు పత్తి రూపంలో ఉండే పుప్పొడి లేదా బీజ రేణువులను విడుదల చేస్తాయి.

దీంతో కొంత మందిలో శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయ‌నే వాద‌న ఉంది. అవి విడుదల చేసే బీజ రేణువులు వల్ల కరోనా మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాద ముదని భావిస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి, చెట్ల నుంచి విడుదలయ్యే బీజ రేణువులు కారణమని ఏ ఆధారం లేదని నిపుణులు చెప్తున్నారు. దాదాపు కశ్మీర్‌లో 2 కోట్ల పోప్లార్ చెట్లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ చెట్ల నరికివేతపై విమర్శలు కూడా వినబడుతున్నాయి.

చెట్లను అనవసరంగా నరికివేస్తే పర్యావరణ విపత్తుకు దారితీస్తుందని, అలాగే పక్షులు, జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2014లో ఓ కోర్టు ఆదేశాల మేరకు కశ్మీర్ ప్రభుత్వం ఇలాంటి 26వేల చెట్లు నరికివేసింది. ఆ చెట్లనుంచి వెలవడే బీజ రేణువులు శ్వాస సంబంధిత సమస్యలను సృష్టిస్తుందని ఆరోపిస్తూ దాఖలు చేసిన ఓ పిటిషన్ మేరకు కోర్టు అప్పుడు చెట్ల నరికివేతకు తీర్పు ఇచ్చింది.