Begin typing your search above and press return to search.
కొహ్లి 0 చేసినా.. మనం గెలవగలం!
By: Tupaki Desk | 18 Sep 2017 5:31 AM GMTచెన్నయ్ చేపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ ఓ అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని భారత జట్టుకు కలిగించింది. కెప్టెన్ విరాట్ కొహ్లి 0 పరుగులకు అవుటైనా సరే.. అది కూడా జట్టులోని ఓపెనర్లు పెద్ద స్కోరు చేయకుండానే వెనుతిరిగినప్పుడు.. సాధారణంగా పరిస్థితిని చక్కదిద్దే బాద్యత తన భుజాల మీద వేసుకునే కొహ్లి 0 కే నిష్క్రమించినా.. భారత జట్టు ను ఓడించడం కష్టం అని ఈ విజయం ప్రపంచానికి నిరూపించింది. అటు బ్యాటింగ్ బౌలింగ్ లలో భారత జట్టు అపురూపమైన ప్రతిభను ప్రదర్శించింది.
చేపాక్ పరాజయానికి ఆస్ట్రేలియా డక్ వర్త్ లూయిస్ పద్ధతిని నిందించడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. ఎందుకంటే.. ఆట వారికి అనుమతించిన 21 ఓవర్లలో వారు ఏకంగా 9 వికెట్లు కోల్పోయారు. అంటే వారిని 50 ఓవర్లు ఆడించి ఉన్నప్పటికీ.. లక్ష్యం ఛేదించగలిగేవారు కాదన్న మాట వాస్తవం.
ఇటీవలి కాలంలో ప్రత్యేకించి ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు తరచూ 300 దాటుతున్న స్కోర్లు.. ప్రేక్షకులకు అలాంటి ఆశలే కల్పించాయి. అయితే ఆదివారం తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ 281 వద్ద తన పరుగుల ప్రస్థానం ముగించింది. కొహ్లి 0కే అవుటయ్యాడు. ఒకరి తర్వాత ఒకరు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ వెళ్లిపోయినా కూడా ఆస్ట్రేలియాకు ఇసుమంత ఆనందం కలిగే అవకాశం లేకుండా.. పాండ్య - ధోని విరుచుకుపడ్డారు. భారత్ ఏ ఆర్డర్ లోనైనా అవసరాన్ని బట్టి విశ్వరూపం ప్రదర్శించగలదని జట్టు దయనీయ స్థితికి జారిపోకుండా చూడగలదని వారు నిరూపించారు. 281 పరుగుల లక్ష్యం ఆస్ట్రేలియాకు తొలుత చిన్నదిగానే కనిపించి ఉండవచ్చు గానీ.. భారత బౌలర్ల ధాటికి వారు విలవిల్లాడారు.
లక్ష్యాలు మీ కంటికి ఎలా కనిపించినా సరే.. బంతులు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తీరుతాయి అని సవాలు విసురుతున్నట్లుగా.. భారత బౌలర్లు విరుచుకుపడడం విశేషం. భారత జట్టులో ఏ ఒక్క బ్యాట్స్ మెన్ సెంచరీ చేయలేదు - బౌలర్లలో ఏ ఒక్కరూ అయిదు వికెట్లు తీయలేదు. అలాంటి వ్యక్తిగత అద్భుతాలు ఏమీ నమోదు కాలేదు. కానీ... జట్టుగా మాత్రం అందరూ కలసి ఓ అద్భుత విజయాన్ని సాధించగలిగారు. అందుకే టీమిండియాను శెభాష్ అనాలి.