Begin typing your search above and press return to search.
వ్యాక్సినేషన్‌లో అమెరికా ను వెనక్కి నెత్తిన ఇండియా !
By: Tupaki Desk | 28 Jun 2021 6:33 AM GMTమనదేశంలో కరోనా వైరస్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. మొదటి వేవ్ నుండి గుణపాఠాలు పూర్తిగా నేర్చుకోకమునుపే సెకండ్ వేవ్ విజృంభణ మొదలైంది. సెకండ్ వేవ్ లో దేశంలో భారీ సంఖ్యలో , ప్రపంచంలో ఏ దేశంలో కూడా నమోదు కానటువంటి భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అయితే తగ్గిపోయింది. త్వరలోనే మూడో వేవ్ కూడా రావొచ్చు అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే .. కరోనా మహమ్మారి కట్టడి కి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. అందుకే వ్యాక్సిన్ ను శరవేగంగా ఇస్తున్నారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదట్లో ప్రాధాన్యత వారీగా వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ , ఆ తర్వాత 18 ఏళ్లు పై బడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. రోజుకు లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ను ప్రారంభించారు. మొదట్లో మందకోడిగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని రోజులుగా వేగంగా అమలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అప్పుడు వ్యాక్సిన్ ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉండేది. కానీ, ప్రస్తుతం వ్యాక్సిన్ ఉత్పత్తి , ఇతర వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ ను వేగంగా కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా మరో కొత్త రికార్డ్ ను సాధించింది. ప్రపంచంలో అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించిన దేశంగా ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఇండియాలో ఇప్పటి వరకు 32,36,63,297 మందికి వ్యాక్సిన్ ను అందించారు. అమెరికాలో 32,33,27,328 మందికి వ్యాక్సిన్ అందించారు. ఇండియా, అమెరికా తరువాత ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఈ జాబితాలో వరుసగా నిలిచాయి.