Begin typing your search above and press return to search.
గూగుల్ సీఈవోగా మనోడే
By: Tupaki Desk | 11 Aug 2015 4:20 AM GMTప్రపంచ ప్రఖ్యాత గాంచిన కంపెనీల్లో భారతీయుల జోరు పెరుగుతోంది. అంతర్జాతీయంగా ప్రభావం చూపే పలు కంపెనీల్లో కీలక స్థానాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు ఎంపికవుతున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఈసీవోగా సత్యనాదెళ్ల నియమితులై విజయవంతంగా దూసుకుపోతుంటే.. తాజాగా.. ప్రపంచానికి తాను లేనిదో నిమిషం కూడా తోచనద్నట్లుగా తయారైన గూగుల్ కంపెనీ సీఈవోగా భారత సంతతికి చెందిన వ్యక్తి బాధ్యతలు స్వీకరించనున్నారు.
తమిళనాడులోని చెన్నై లో 1972లో జన్మించిన సుందర్ పిచాయ్ గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఐటీ ఖరగ్పూర్ నుంచి బీటెక్ చేసిన ఆయన స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ను.. వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
2004లో గూగుల్ లో చేరిన సుందర్ అంచలంచెలుగా ఎదిగి తాజాగా సీఈవో స్థాయికి చేరటం విశేషం. ఒక భారతీయుడు.. అందునా దక్షిణాకి ప్రాంతానికి చెందిన వ్యక్తి గూగుల్ సీఈవోగా ఎంపిక కావటం ఒక ప్రత్యేకత అయితే.. సత్యానాదెళ్ల.. సుందర్ ఇద్దరూ దక్షిణాది ప్రాంతానికి చెందిన వారు కావటం గమనార్హం.