Begin typing your search above and press return to search.

కాశ్మీరీ పౌరుల రక్షణ కోసం భారత్ భారీ ప్లాన్..

By:  Tupaki Desk   |   28 Feb 2019 7:14 AM GMT
కాశ్మీరీ పౌరుల రక్షణ కోసం భారత్ భారీ ప్లాన్..
X
భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు పోరు తీవ్రమవుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.. కానీ ఈ యుద్ధం మధ్య భిక్కు భిక్కుమంటున్న కాశ్మీరీలను చూసి భారత ప్రభుత్వం చలించింది. వారిని కాపాడేందుకు బృహత్తర చర్యలు చేపట్టింది. దాయాదుల మధ్య పోరు జరిగినప్పుడల్లా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లోని ప్రజలు బలవుతున్నారు. తుపాకుల మోతతో వారి జీవనం కష్టంగా మారుతోంది. దీంతో ఇండియా వారికి రక్షణ కల్పించేందుకు బంకర్లను నిర్మిస్తోంది.

కాల్పులు జరిగినప్పుడల్లా ఈ బంకర్లలో ప్రజలు తలదాచుకుంటే వారి ప్రాణాలకు రక్షణ ఉంటుంది. అందుకే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన భారత్‌ ఆయా ప్రాంతాల్లో మొత్తం 14వేల బంకర్లను నిర్మిస్తున్నారు. సరిహద్దులో కాల్పలు జరిగినప్పుడల్లా వీరిని బంకర్లలోకి తరలిస్తే వారి ఫ్రాణాలకు ఎటువంటి ప్రమాదం ఉండదని భారత రక్షణ అధికారి ఒకరు తెలిపారు. బంకర్ల నిర్మాణం ద్వారా ప్రజల్లో భయాందోళనలు పోగొట్టోచ్చని ఆయన తెలిపారు.

గత ఏడాది జూన్‌ లో ఈ నిర్మాణాలు చేపట్టారు. రూ.60 మిలియన్ల డాలర్లతో చేపడుతున్న ఇవి చాలా ధృఢంగా ఉంటాయి. అంతేకాకుండా బుల్లెట్‌ లోపలికి వెళ్లకుండా పటిష్టంగా నిర్మిస్తున్నారు. పూల్వామా ఘటన తరువాత సరిహద్దుల్లో కాల్పులు నిరంతరం జరగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత ప్రభుత్వం బంకర్లను ప్రారంభించి అందులో ప్రజలను ఉంచి సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమైంది. .