Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే ఎక్కువ కరోనా వ్యాక్సిన్ డోస్ లు కొన్న ఇండియా .. ఎన్నంటే ?
By: Tupaki Desk | 5 Dec 2020 10:43 AM GMTప్రపంచాన్ని మొత్తం గడగడ వణికించేసిన కరోనా ను కట్టడి చేసే వ్యాక్సిన్ అతి త్వరలో రాబోతుంది. ఇప్పటికే భారత్ పలు డ్రగ్ మేకర్ల నుంచి కరోనా వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో 1.6 బిలియన్ మోతాదులతో కరోనా వ్యాక్సిన్లను భారత్ అత్యధికంగా కొనుగోలు చేసింది. దీంతో భారత అతిపెద్ద వ్యాక్సిన్ కొనుగోలుదారుగా మారింది. ప్రపంచ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. 800 మిలియన్ల మంది లేదా జనాభాలో 60 శాతం మందికి సరిపోయేంతగా కరోనా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసేసిందట.
దీని ప్రకారం ... 60 శాతం జనాభాకు 1.6 బిలియన్ల మోతాదు సరిపోతుందని అంచనా వేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 500 మిలియన్ మోతాదులు, యుఎస్ కంపెనీ నోవావాక్స్ నుండి ఒక బిలియన్, రష్యా గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి స్పుత్నిక్- వి వ్యాక్సిన్ 100 మిలియన్ మోతాదులను భారత్ కొనుగోలు చేసినట్లు అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్శిటీ గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో యూరోపియన్ యూనియన్ 1.58 బిలియన్ల డోస్ లను కొనుగోలు చేయగా.. అమెరికా ఒక బిలియన్ డోస్ లను కొనుగోలు చేసింది.
2021 జూలై-ఆగస్టు నాటికి భారత్‌లో 250 నుంచి 300 మిలియన్ల ప్రజలకు 400-500 మిలియన్ మోతాదుల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని గత నవంబర్ లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు. ఇక , భారత్ బయోటెక్ భారతదేశ వ్యాక్సిన్ కూడా ఈ వారం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లోకి ప్రవేశించింది.