Begin typing your search above and press return to search.

చంద్రయాన్2 మరో అద్భుతం చేయబోతోంది..

By:  Tupaki Desk   |   5 Sep 2019 6:42 AM GMT
చంద్రయాన్2 మరో అద్భుతం చేయబోతోంది..
X
భారత ప్రజలు - ఇస్రో శాస్త్రవేత్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహాత్తర క్లిష్ట ఘట్టం ఆవిష్కృతమయ్యే రోజు రానే వచ్చింది. చంద్రయాన్2 ప్రయోగంలోనే మూడో ఘాట్టాన్ని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతం చేసి సత్తాచాటారు. దీంతో ఇప్పుడు మన చంద్రయాన్ 2 చంద్రుడికి కేవలం 35 కి.మీల దీర్ఘావృత్తాకార కక్ష్యలో తిరుగుతుండడం విశేషం.

ఈ బుధవారం తెల్లవారుజామున 3.42 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడి కక్షలో తిరుగుతున్న చంద్రయాన్ 2లోని ల్యాండర్ లో ఉన్న ఇంధనాన్ని 9 సెకండ్ల పాటు మండించారు. బెంగళూరులోని బైలాలు మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో దూరంగా ఉన్న కక్ష్యలోంచి చంద్రయాన్ 2 చంద్రుడికి దగ్గరగా 35కి.మీల దూరంలోని కక్ష్యలోకి వచ్చింది.

ఇప్పుడు కీలకమైన.. అత్యంత సంక్లిష్టమైన ల్యాండర్ ను చంద్రుడిపై దించే ఘాట్టాన్ని ఈ నెల 7న అర్ధరాత్రి 1.30 గంటల నుంచి 2.30 మధ్య నిర్వహించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ అయ్యారు. ల్యాండర్ ను చంద్రుడి ఉపరితలం పైకి 35 కి.మీల ఎత్తునుంచి జాగ్రత్తగా దించుతారు. ల్యాండర్ దిగగానే అందులోంచి కొద్దిసేపటికి రోవర్ చంద్రుడి మీదకు దిగుతుంది. ఇది 14 రోజుల పాటు సూర్యుడి కిరణాలతో సోలార్ విద్యుత్ తయారు చేసుకొని ప్రయాణిస్తూ పరిశోధనలు చేస్తూ ఫొటోలు తీసి భూమికి (ఇస్రో కేంద్రానికి) పంపుతుంది.

మరోవైపు ల్యాండర్ వదిలాక ఉన్న చంద్రయాన్ 2 మాత్రం చంద్రుడి చుట్టు 96 కిమీల దగ్గరైన వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ కిందనున్న ల్యాండర్ కదలికలను గమనిస్తుంటుంది. ఇది కూడా ఇస్రోకు సమాచారాన్ని పంపిస్తుంటుంది.