Begin typing your search above and press return to search.
భారత్-చైనా వివాదం ....ట్రంప్ కామెంట్స్ !
By: Tupaki Desk | 21 Jun 2020 7:50 AM GMTగత కొన్ని రోజులుగా భారత్ ,చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇరుదేశాలు చర్చలు జరుపుతుండగానే ...బోర్డర్ లో ఇరుదేశాల సైన్యం దాడులకు దిగారు. ఈ దాడుల్లో భారత్ కి చెందిన 20 మంది ఆర్మీ సైన్యం వీరమరణం పొందారు. దీనిపై ఈ సరిహద్దు వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిపోయింది. దీనిపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.
సరిహద్దు విషయంలో భారత్-చైనా మధ్య సంక్లిష్ట పరిస్థితులు తలెత్తాయని తెలిపారు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇది చాలా పెద్ద సమస్యగా ఆయన అభివర్ణించారు. ఇరు దేశాలకు సాయం చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఓక్లహోమాలోని తుల్సాలో తలపెట్టిన ఎలక్షన్ ర్యాలీకి వెళుతున్న క్రమంలో భారత్-చైనా ఉద్రిక్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు ట్రంప్. “ఇది చాలా సంక్లిష్ట పరిస్థితి. మేము ఇండియాతో మాట్లాడుతున్నాం. అలాగే చైనాతో మాట్లాడుతున్నాం. బార్డర్ విషయంలో వారికి పెద్ద సమస్య తలెత్తింది. వారు ఆపదలో ఉన్నట్లే అనిపిస్తోంది. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం. వారికి సాయం చేసేందుకే ప్రయత్నాలు చేస్తున్నాం” అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
జూన్ 15 రాత్రి తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్-చైనా దేశాల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రరూపం తాల్చాయి. లద్దాఖ్ సరిహద్దుల్లో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి.