Begin typing your search above and press return to search.

మా సైనికులు 30 మంది చనిపోయారు: చైనా ప్రకటన

By:  Tupaki Desk   |   17 Jun 2020 3:54 PM GMT
మా సైనికులు 30 మంది చనిపోయారు: చైనా ప్రకటన
X
భారత్ - చైనా బలగాల మధ్య లఢక్ వద్ద గాల్వాన్ లోయలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకొని 20 మంది మన సైనికులు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీ నష్టమే జరిగిందనే వాదనలు వినిపించాయి. కానీ చైనా ఇప్పటి వరకు మౌనం దాల్చింది. ఇప్పుడు చైనా అధికారికంగా తమ వాళ్లు కూడా ఈ పోరులో ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. భారత్ -చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో తమ సైనికులు 30 మంది మరణించారని చైనా మొదటిసారి అంగీకరించింది.

దాదాపు రెండు రోజులు కావొస్తున్నా.. తమ వైపు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారో చైనా వెల్లడించలేదు. కానీ ఇప్పుడు అసలు విషయం చెప్పింది. మరోవైపు, తాము యుద్ధం కోరుకోవడం లేదని, భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని చైనా చెబుతోంది. చర్చలు అంటూనే ఇండియా భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

కాగా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు బుధవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్... చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాట్లాడుతూ సరిహద్దు సమస్యని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ విధమైన ఘర్షణలు అవరోధంగా మారుతాయన్నారు. ఒక దేశం గౌరవాన్ని మరో దేశం గుర్తించాలన్నారు.

వాంగ్ యీ మాత్రం బోర్డర్స్ ఉల్లంఘించిన వారి పట్ల కఠినచర్యలు తీసుకోవాలన్నారు. పరోక్షంగా ఘర్షణకు భారత్ కారణమని చైనా వక్రబుద్ధి చూపించుకున్నారు. అయితే ఘర్షణకు ఇది సమయం కాదన్న జైశంకర్ అభిప్రాయంతో ఏకీభవించారు. చైనా సైనికులు ముందుగా ప్లాన్ చేసుకొని ఘర్షణకు దిగారని జైశంకర్ ఆరోపించారు. చైనా తన చర్యలను మదింపు చేసుకొని సరిదిద్దుకోవాలని సూచించారు.