Begin typing your search above and press return to search.

పాక్ చేసే పాడు పనిని ఓపెన్ గా చెప్పేశాడు

By:  Tupaki Desk   |   28 Nov 2016 4:07 AM GMT
పాక్ చేసే పాడు పనిని ఓపెన్ గా చెప్పేశాడు
X
ప్రపంచ ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. ఉగ్రవాదుల్ని పెంచి పోషించే నైజం ఉన్న పాకిస్థాన్ నిజ స్వరూపాన్ని ఆ దేశానికి చెందిన ప్రముఖుడు ఒకడు తొలిసారి బట్టలు విప్పదీశాడు. ఉగ్రవాదానికి.. పాకిస్థాన్ కు అవినాభావ సంబంధం ఉందంటూ భారత్ చేసే ఆరోపణలు వంద శాతం నిజమన్న విషయాన్ని ఆయన తేల్చేశారు. అమెరికాలో పాక్ రాయబారిగా పని చేసిన పాకిస్థానీ ప్రముఖుడు ఒకరు తన దేశం చేసే పాడు పనిని ఓపెన్ గా చెప్పేసిన వైనం సంచలనంగా మారటమే కాదు.. ఆ దేశ దుర్మార్గ బుద్ది ప్రపంచానికి తెలిసేలా చేశారని చెప్పాలి.

ఉగ్రవాదం.. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నందుకు మిగిలిన దేశాల కంటే పాకిస్థాన్ కే ఎక్కువ నష్టం వాటిల్లిందని చెప్పేశారు. అఫ్ఘనిస్థాన్.. కశ్మీర్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదాన్ని అక్కున చేర్చుకుంటున్న వైఖరి కారణంగా తమ దేశం ఎంతగా నష్టపోతుందో చెప్పిన ఆయన.. ఈ విషయం పాక్ కూడా గ్రహించిందని చెప్పారు. ఉగ్రవాదం కారణంగా భారత్ కంటే కూడా పాకిస్థాన్ కే ఎక్కువగా నష్టపోయిందన్న మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ మాటలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి. అదే సమయంలో పాక్ ను ఇరుకున పడేసేలా చేశాయి.

గతంలో అమెరికాలో పాక్ రాయబారిగా వ్యవహరించిన హక్కానీ.. కశ్మీర్ సమస్యపై కూడా స్పందించారు. అదే సమయంలో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతకు కారణం ఏమిటన్నది తన మాటల్లో చెప్పేసిన ఆయన.. ఈ తీరు మారనంత వరకూ సమస్య పరిష్కారం కాదన్నారు. ఆర్మీ చీఫ్ ను మార్చటంతో ఎలాంటి ప్రయోజనం ఉందని తేల్చేసిన ఆయన.. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ భుజాన వేసుకొని తిరుగుతుందన్న మాటను చెప్పేశారు. మరి.. తన దేశానికి చెందిన ప్రముఖుడు ఒకరు చేసిన తాజా వ్యాఖ్యలపై పాక్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/