Begin typing your search above and press return to search.

కరోనా కారణంగా భారత్ లో రెండో మరణం

By:  Tupaki Desk   |   14 March 2020 4:23 AM GMT
కరోనా కారణంగా భారత్ లో రెండో మరణం
X
కరోనా కల్లోలం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. భారత్ లో మాత్రం ఇప్పడిప్పుడే రాజుకుంటోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో తగ్గిపోయింది. కానీ ఇరాన్ - ఇటలీ - దక్షిణ కొరియాలాంటి దేశాల్లో మాత్రం విరుచుకుపడుతోంది.

తాజాగా కరోనా కారణంగా భారత్ లో రెండో మరణం చోటుచేసుకుంది. ఢిల్లీలో 69 ఏళ్ల వృద్ధురాలు కరోనా వైరస్ కారణంగా మరణించింది. ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

మృతురాలు ఇటీవలే విదేశాలకు వెళ్లి వచ్చింది. కరోనా సోకడంతో ఢిల్లీలో చికిత్స తీసుకుంటోంది. ఈమెకు గతంలోనే బీపీ, షుగర్ వ్యాధులున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో చనిపోయిందని వైద్యులు తెలిపారు.

ఢిల్లీలో ఇప్పటివరకూ 6 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 80కు చేరింది. ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. కర్ణాటకలో కరోనా సోకిన 76 ఏళ్ల వృద్ధుడు మొదటి కరోనా మృతుడు.