Begin typing your search above and press return to search.
భారతీయులకు అమెరికా జర్నీ ఇక మరింత ఈజీ
By: Tupaki Desk | 5 Jun 2016 6:42 AM GMTప్రపంచానికి పెద్దన్న అమెరికా కేవలం తొమ్మిది దేశాలతో ఒక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఆయా దేశాల నుంచి అమెరికాకు వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమెరికా అలా ఒప్పందం చేసుకున్న తొమ్మిది దేశాల్లో భారత్ ఒకటి. తాజా ఒప్పందం నేపథ్యంలో ఎంపిక చేసిన ఎయిర్ పోర్ట్ ల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా భారతీయులు అమెరికాకు వెళ్లే సౌకర్యం అందుబాటులోకి రానుంది.
దీంతో.. అత్యంత వేగంగా భద్రతాపరమైన అనుమతులు మంజూరు చేయటంతో పాటు.. ప్రయాణ ఇబ్బందులు తగ్గనున్నాయి. ఈ తరహా ఒప్పందాలు గతంలో ఎనిమిది దేశాలతో అమెరికా చేసుకోగా.. భారత్ తొమ్మిదో దేశంగా చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడే ఈ ఒప్పందం అమల్లోకి రానప్పటికీ.. మరికొద్ది నెలల సమయంలోనే కొత్త ఒప్పందానికి సంబంధించిన వెసులుబాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఒప్పందం కానీ అమల్లోకి వస్తే అమెరికా జర్నీ మరింత ఈజీగా ఉంటుందని చెబుతున్నారు.