Begin typing your search above and press return to search.

చైనా, అమెరికాలను తొక్కేసిన మోడీ

By:  Tupaki Desk   |   30 Sep 2015 12:16 PM GMT
చైనా, అమెరికాలను తొక్కేసిన మోడీ
X
అమెరికా, చైనా, రష్యా.. ఇలా అగ్రదేశాలన్నిటినీ ఇండియా ఒక్క దెబ్బకు వెనక్కు నెట్టేసింది. మోడీ మార్కెటింగ్ మాయాజాలానికి ఇండియాలో వరల్డ్ లో నంబర్ 1 పెట్టుబడి అనుకూల దేశంగా అవతరించింది. దీంతో మోడీని విమర్శించేవారి నోళ్లన్నీ మూతపడుతున్నాయి. తాజాగా ఫైనాన్సియల్ టైమ్స్ ప్రకటించిన ఓ జాబితాలో ఇండియా నంబర్ 1గా ఉండడం అందరినీ ఆలోచింపజేస్తోంది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్ డీఐ)లను ఆకర్షించడంలో ఇండియా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నిటినీ దాటేసింది. 2015 ప్రథమార్థ భాగంలో ఇండియాకు 31 బిలియన్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇండియాలో తరువాత 28 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో.. 27 బిలియన్ల డాలర్ల పెట్టుబడుల సాధనతో అమెరికా మూడో స్థానంలో నిలిచాయి. అయితే... ఇదంతా అంచనా వ్యయమే అయినప్పటికీ ఇంత స్థాయిలో పెట్టుబడుల హామీ ఉన్నప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మనమేనని తేలింది. మరోవైపు గత ఏడాది కంటే ఈ ఏడాది 47 శాతం ఎఫ్ డీఐలు పెరిగాయట.

ఎఫ్ డీఐల విషయంలో ఇంతగా ప్రగతి సాధించడానికి మోడీయే కారణమని అందరూ విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచే మోడీ గ్లామర్ ప్రపంచమంతా వ్యాపించడం... ఎన్నికల తరువాత ఆయన ప్రపంచదేశాలకు స్నేహ హస్తం చాచడం వంటివి తోడ్పడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే మోడీ తాను ప్రధాని అయిన తరువాత 25 దేశాల్లో పర్యటించారు. ఈ కారణాలతో ప్రపంచమంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోంది.

అత్యధిక ఎఫ్ డీఐలు సాధించిన తొలి పది దేశాలు..

- ఇండియా...
- చైనా
- అమెరికా
- బ్రిటన్
- మెక్సికో
- ఇండేనేసియా
- వియత్నాం
- స్పెయిన్
- మలేసియా
- ఆస్ట్రేలియా