Begin typing your search above and press return to search.

కరోనాకి మందు కనిపెట్టేసిన ఇండియన్స్ !

By:  Tupaki Desk   |   14 March 2020 5:32 AM GMT
కరోనాకి మందు కనిపెట్టేసిన ఇండియన్స్  !
X
కరోనా వైరస్ తో ఇబ్బంది పడని దేశం అంటూ ఈ ప్రపంచంలో లేదు. కరోనా పేరు చెప్తే ఈ ప్రపంచంలోని అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఈ కరోనా భారిన పడి ఇప్పటివరకు 5423 మంది మృత్యవాత పడ్డారు. అలాగే సుమారుగా లక్షా 40 వేలమంది ఈ కరోనా తో భాదపడుతున్నారు. చైనా లో ఈ వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ ..మిగిలిన దేశాలలో రోజురోజుకి ఈ తీవ్రత పెరిగిపోతుంది. ఇక భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 82 కి చేరింది. అలాగే భారత్ లో కరోనా సోకడం తో ఇప్పటి వరకు ఇద్దరు మృతిచెందారు.

జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసలో ఇబ్బంది.. ఈ కరోనా వ్యాధి లక్షణాలు చూస్తే మామూలుగానే అనిపిస్తాయి. కానీ ఇవన్నీ తీవ్ర స్థాయిలో ఒకే సారి రోగిని ఎటాక్ చేసి ప్రాణాలు తీసేస్తున్నాయి. రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్లు తట్టుకుంటున్నారు. ఆ శక్తి లేని వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారంగా 5 వేలమంది కి పైగా చనిపోయారు అని చెప్తున్నప్పటికీ ...అనధికారంగా ఈ లెక్క ఇంకా ఎక్కువగా ఉండచ్చు. వైద్య రంగంలో ఎంతో ప్రగతి సాధించిన దేశాలు సైతం ఈ కరోనాకి ఇంకా మందు కనిపెట్టలేకపోతున్నాయి.

అయితే, కరోనాకు ప్రపంచంలో తొలిసారి మందు కనిపెట్టిన దేశంగా ఇప్పుడు ఇండియా పేరు వినిపిస్తుండటం గమనార్హం. జైపూర్లోని ఒక ఆసుపత్రిలోని ఒక వైద్యుల బృందం కరోనాకు మందు కనిపెట్టినట్లు నేషనల్ మీడియా వార్తలు వస్తుండటం విశేషం. ఇటలీకి చెందిన 16 మంది టూరిస్టులకు కరోనా వైరస్ సోకినట్లు జైపూర్లో గుర్తించడం, దానితో వారిని వారం కిందట ఆసుపత్రిలో చేర్చడం తెలిసిన సంగతే. కరోనా సోకినా వారి కోసం ఈ హాస్పిటల్ ఒక ప్రత్యేక వైద్య బృందం పనిచేస్తుంది. ఆ బృందం లోని వైద్య నిపుణులు అందరూ కలిసి వాళ్లను ట్రీట్ చేసే క్రమంలో కరోనాకు మందు కనిపెట్టినట్లు సమాచారం. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందులనే కలిపి కరోనాకు కొత్త మందు కనిపెట్టిందట ఈ బృందం. నాలుగు రకాల మందుల కలయికతో ఈ కొత్త మందు తయారు చేసి, కరోనా సోకిన ఓ పేషెంట్‌ కు ఇవ్వగా అతను కరోనా నుంచి కోలుకున్నట్లు తెలుస్తుంది. దీనితో ఈ మందుకు ఇప్పటికే ఉన్నత వైద్యుల అనుమతి కూడా లభించిందని.. ఇంకొన్ని ప్రయోగాల అనంతరం దీన్ని అధికారికంగా కరోనా మందుగా ప్రకటిస్తారని సమాచారం. ఒక్కసారి ఇది బయటకి వస్తే ప్రపంచం మొత్తం ఇదే మందుని వినియోగిస్తారని వైద్య నిపుణులు చెప్తున్నారు.