Begin typing your search above and press return to search.

ర్యాంక్ పడిపోయింది.. అందుకోసం ఆడటంలేదు!

By:  Tupaki Desk   |   23 Aug 2016 8:55 AM GMT
ర్యాంక్ పడిపోయింది.. అందుకోసం ఆడటంలేదు!
X
వెస్టిండీస్‌ తో నాలుగో టెస్టు వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోవడంతోపాటు... ర్యాంకుల్లో భారత్ నెం. 1 స్థానాన్ని కూడా కోల్పోయింది. వెస్టిండీస్ తో ఈ టెస్టు మ్యాచ్ గెలిచి ఉంటే భారత్‌ నెం.1 ర్యాంకు నిలబడేది. అయితే వర్షం కారణంగా చివరి టెస్టు మ్యాచ్ కోల్పోయినా సిరీస్‌ ను మాత్రం 2-0తో భారత్ గెలిచింది. అయితే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ లో ఇటీవలే నెంబర్‌ వన్‌ స్థానాన్ని సంపాదించిన భారత్‌... తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్‌ లో రెండో స్థానానికి పడిపోయింది. దీనికి కారణం కచ్చితంగా వెస్టిండీస్‌ తో జరిగిన ఆఖరి టెస్టు వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోవడమే.

ఈ సంగతి అలా ఉంటే మరోవైపు పాకిస్థాన్‌ తన క్రికెట్ చరిత్రలో తొలిసారిగా నెంబర్‌ వన్‌ ర్యాంకు సాధించింది. భారత్ కు నెం. 1 పోవడం ఒక బాద అయితే.. ఆ స్థానాన్ని పాక్‌ ఆక్రమించడం మరో బాద అని చెబుతున్నారు భారత క్రికెట్ క్రీడాభిమానులు. స్పోర్ట్స్ ని స్పోర్టివ్ గా తీసుకోవాలనే విషయం ఇండియా - పాక్ క్రికెట్ విషయంలో మాత్రం ఎవ్వరూ వినరు కదా! అయితే తొలిస్థానాన్ని సంపాదించిన పాక్ కు - రెండో స్థానానికి పడిపోయిన భారత్ కు కేవలం ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉండటం గమనార్హం. పాక్ తొలిస్థానంలో 111 పాయింట్లతో ఉంటే.. భారత్‌ 110 పాయింట్లతో ద్వితీయ స్థానంలో ఉంది.

అయితే ఈ విషయాలపై స్పందించిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నట్లు చెప్పాడు. ర్యాంకులు ఎప్పుడూ స్థిరంగా ఉండవని, అందువల్లే తాము "ర్యాంకులు కోసం ఆడట్లేదు" అని స్పష్టం చేశాడు. ఈ టూర్ లో జట్టులో సహ్యుల ప్రదర్శనపై ఒక్కొక్కరినీ వ్యక్తిగతంగా ప్రస్థావిస్తూ విరాట్ అభినందించాడు. కొద్ది రోజుల్లో స్వదేశంలో న్యూజిలాండ్‌ తో జరగబోయే టెస్టు సిరీస్‌ లో కొత్త కొత్త కాంబినేషన్లు ప్రయత్నిస్తామని తెలిపాడు.

తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి...

1 - పాకిస్తాన్ (111 పాయింట్లు)

2 - ఇండియా (110)

3 - ఆస్ట్రేలియా (108)

4 - ఇంగ్లాండ్ (108)

5 - న్యూజిలాండ్ (99)

6 - శ్రీలంక (95)

7 - దక్షిణాఫ్రికా (92)

8 - వెస్టిండీస్ (67)

9 - బంగ్లాదేశ్ (57)

10 - జింబాబ్వే (8)