Begin typing your search above and press return to search.
భారత్ , ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ రద్దు .. ఎన్ని కోట్ల నష్టమంటే
By: Tupaki Desk | 11 Sep 2021 5:41 AM GMTఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. భారత్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి పుస్తకం ‘స్టార్ గేజింగ్’ ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత ఆయనతోపాటు మరికొందరు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఐదో మ్యాచ్ నిర్వహించడం అసాధ్యంగా మారింది. అనంతరం ఈ విషయంపై బీసీసీఐ, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) చర్చించుకున్నాయి. ఆ తర్వాత మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
అయితే ఈ ఒక్క టెస్టు మ్యాచ్ రద్దవడం వల్ల లాంక్ షైర్ క్రికెట్ కు, ఈసీబీకి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోవడంతో వీరికి సుమారు 30 మిలియన్ పౌండ్లు అంటే మన లెక్కల్లో దాదాపు రూ.304 కోట్లు నష్టం వచ్చినట్లేనట. మ్యాచ్ ప్రసార హక్కులు తదితర మార్గాల ద్వారా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయం మొత్తం పోయినట్లే.
ఈ నేపథ్యంలో రద్దయిన మ్యాచ్ ను వచ్చే ఏడాది నిర్వహించాలని ఈసీబీ కోరిందట. దీనికి బీసీసీఐ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు కార్యదర్శి జైషా తెలిపారు. ఈ మ్యాచ్ 2021-23 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్నందున రెండు జట్లకూ అన్యాయం జరగకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
అయితే ఈ మ్యాచ్ వచ్చే ఏడాది జరిగినా ప్రస్తుత సిరీస్ తో దీనికి సంబంధం ఉండదని, దాన్ని వేరే మ్యాచ్ గానే పరిగణిస్తామని ఈసీబీ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుత టెస్టు సిరీస్ 2-1తో అనధికారికంగా భారత్ వశమైనట్లేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. కాగా, మ్యాచ్ రద్దు ప్రకటన అనంతరం తొలుత టీమిండియా మ్యాచ్‌ను వదులుకోవడానికి సిద్ధమైందంటూ ప్రకటన విడుదల చేసిన ఈసీబీ.. నిమిషాల వ్యవధిలోనే ఆ పదాన్ని తొలగించి.. టీమిండియా కరోనా కేసుల భయం కారణంగా జట్టును బరిలోకి దించలేకపోతుందంటూ మార్చేసింది. మరోవైపు సిరీస్ ఫలితంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా ఈసీబీ మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చింది.