Begin typing your search above and press return to search.

చరిత్ర పునరావృతం.. భారత్ చేతిలో పాక్ చిత్తు

By:  Tupaki Desk   |   5 Feb 2020 4:54 AM GMT
చరిత్ర పునరావృతం.. భారత్ చేతిలో పాక్ చిత్తు
X
ప్లేస్ ఏదైనా.. జట్టు సభ్యులు ఎవరైనా.. అదే చరిత్ర.. ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్ కు భంగపాటు.. భారత్ జైత్రయాత్రకు తిరుగులేదు. తాజాగా అండర్ 19 ప్రపంచకప్ క్రికెట్ లో మరో అద్భుతం చోటుచేసుకుంది.

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ సెమీఫైనల్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది. ఓ లేడిపై పులిపడ్డట్టు వేటాడేసింది. అద్భుతంగా ఏకంగా 10 వికెట్ల తేడాతో వికెట్ నష్టపోకుండా టార్గెట్ ఫినిష్ చేసి పాకిస్తాన్ ను ఇంటికి సాగనంపింది. ఫైనల్స్ కు దూసుకెళ్లింది.

టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. రెండో ఓవర్ లోనే భారత్ పాకిస్తాన్ వికెట్ల పతనాన్ని షురూ చేసింది. ఆపై క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూనే ఉంది. పాక్ ఓపెనర్ హైదర్ అలీ, కెప్టెన్ రోహైల్ నజీర్ భారత బౌలర్లను కాచుకొని 50 పరుగుల భాగస్వామ్యం తో కాస్త అడ్డుకున్నారు. చివరకు 44 ఓవర్ల లో పాకిస్తాన్ 172 పరుగులకే అలౌట్ అయ్యింది.

దీనికి సమాధానంగా భారత్ దూకుడు గా ముందుకెళ్లింది. భారత్ బ్యాంటింగ్ కు పాకిస్తాన్ బెంబేలెత్తింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, దివ్యాన్ష్ సక్సేనా పాక్ బౌలర్ల భరతం పట్టారు. మైదానం నలుమూలాల వీరవిహారం చేసి ఒక్క వికెట్ కోల్పోకుండానే విజయాన్ని కట్టబెట్టారు. జైస్వాల్ సెంచరీ తో చెలరేగాడు. వికెట్ పడకుండా పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించారు. ఫైనల్స్ లోకి భారత్ దూసుకెళ్లింది.

ఫైనల్స్ లో భారత్ .. న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య సెమీస్ విజేత తో తలపడుతుంది.