Begin typing your search above and press return to search.
మరోసారి భారీ మైలేజీ మిస్ చేసుకున్న సారూ
By: Tupaki Desk | 30 April 2020 6:15 AM GMTకరోనా వేళ విధించిన లాక్ డౌన్ ను ఎత్తేస్తారా? పొడిగిస్తారా? అన్న ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెబుతున్నారు. లాక్ డౌన్ అమల్లో ఉండి.. పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం పని చేస్తుంటేనే.. కంట్రోల్ చేయలేని పరిస్థితి. ప్రమాదకర వైరస్ విరుచుకుపడుతున్న వేళ.. ఏ చిన్న పొరపాటు జరిగినా.. అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉండనుంది.
ఈ నేపథ్యంలో తొలిసారి లాక్ డౌన్ ముగిసే వేళకు ముందే.. మరికొన్ని వారాల పాటు లాక్ డౌన్ కంటిన్యూ చేయాల్సిన అవసరాన్ని చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రమాదకర వైరస్ ప్రభావం పొంచి ఉన్న వేళ.. లాక్ డౌన్ ఎత్తేస్తే ఇప్పటివరకూ జరిగిన లాభం మొత్తం పోయే ప్రమాదం ఉందన్న కేసీఆర్.. తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. అయితే.. కేసీఆర్ నోటి నుంచి లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం మాట వచ్చిన తర్వాత ఒడిశా.. పంజాబ్ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.
లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని ప్రస్తావించి.. పొడిగించాలన్న అవసరాన్ని చెప్పే ధైర్యం చేయని వేళ.. అందరి కంటే ముందుగా పొడిగింపు ఎందుకన్న వాదనను సమర్థంగా వినిపించిన కేసీఆర్.. కేంద్రం నిర్ణయం తీసుకునే వరకు వెయిట్ చేయటం తెలిసిందే. మే మూడు వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. తెలంగాణలో మాత్రం మే ఏడు వరకు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కేంద్రం చెప్పిన లాక్ డౌన్ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. మరిప్పుడేం జరుగుతుందన్నది ప్రశ్నగా మారింది. కేసుల తీవ్రత తగ్గకపోగా.. రోజులు గడిచే కొద్దీ పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపు సరికాదన్న వాదనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో.. లాక్ డౌన్ మరికొంత కాలం కొనసాగితే ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయన్న మాటా వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. పరిమిత సడలింపులు ఇచ్చినా పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ఎత్తేసే పరిస్థితి ఇప్పట్లో కనిపించ లేదన్న వైనం స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్.. తమ రాష్ట్రంలో లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
లాక్ డౌన్ పొడిగింపు విషయంలో క్లారిటీ ఉన్నా.. అందుకు తగ్గట్లు నిర్ణయాల్ని తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి వెనుకబడ్డారన్న మాట వినిపిస్తోంది. మిగిలిన సీఎంలతో పోలిస్తే.. కేసీఆర్ ఆలోచనలు వినూత్నంగా ఉండటమే కాదు.. ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంటాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తుంటారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం లాక్ డౌన్ పొడిగింపు విషయంలో మౌనంగా ఉండి.. తనకు రావాల్సిన మైలేజీని మిస్ చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది.