Begin typing your search above and press return to search.
కొత్త జిత్తులతో చైనా కుతంత్రం.. తిప్పికొట్టేందుకు భారత్ పక్కా వ్యూహం..!
By: Tupaki Desk | 2 April 2021 11:00 PM ISTచైనా మనకు పక్కలో బల్లెంలా తయారైన విషయం తెలిసిందే. భారత్ కు చిరకాల శత్రువుగా పాకిస్థాన్ ఉండగా.. చైనా కూడా నిత్యం మనదేశం మీద కుయుక్తులు పన్నుతున్నది. ఏవో కుట్రలు చేసి అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను.. లడఖ్ లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవాలని కుట్రలు చేస్తున్నది. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. అయితే ఎప్పటికప్పుడు భారత్ ఈ కుతంత్రాలను భగ్నం చేస్తూ వస్తున్నది. ప్రస్తుతం హిందూ మహాసముద్రం మీద కూడా పెత్తనం చెలాయించాలని చూస్తున్నది. అయితే చైనా ఆధిపత్యానికి భారత్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నది.
ఇటీవల రెండ్రోజుల పాటు హిందూ మహాసముద్రంపై యుద్ధ వినాస్యాలు నిర్వహించారు. ఇక్కడ భారత్, అమెరికా నావికాదళాలు తమ సత్తాను చాటాయి.
మన నావికాదళ యుద్ధ నౌక శివాలిక్, సముద్ర గస్తీ విమానం పీ8ఐ... అమెరికా నావికాదళం నౌక యూఎస్ఎస్ థియోడోర్ రూజ్వెల్ట్ కెరీర్ స్ట్రైక్ గ్రూప్ లో పాల్గొన్నాయి. హిందూ మహాసముద్రంపై పెత్తనం చెలాయించేందుకు చైనా యత్నిస్తున్నది. ఇందులో భాగంగానే అనేక కుట్రలకు తెరలేపింది.
అయితే చైనా కుట్రలను ప్రపంచదేశాలతో కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని నావికదళ రిటైర్ అధికారులు అంటున్నారు. చైనా మనకంటే ఆర్థికంగా బలమైన దేశం. పైగా ఆ దేశానికి విస్తరణ కాంక్ష ఎక్కువ. నిత్యం తన పొరుగుదేశాలతో గొడవలు పెట్టుకోవడం ఆ దేశానికి అలవాటు. కాబట్టి చైనాతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
ఇప్పటికే లడఖ్ లో చైనా ఎటువంటి కార్యకలాపాలు చేపడుతుందో తెలిసిందే. అంతేకాక.. అరుణాచల్ ప్రదేశ్‌లోనూ ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించింది. పైగా అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ ఆ దేశం తరచూ వాదిస్తూ ఉంటుది.చైనా కుట్రలను ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతుంది కూడా. ఇదిలా ఉంటే తాజాగా హిందూ మహాసముద్రంపై చైనా కన్ను పడింది. ఆ సముద్రంపై పూర్తి ఆధిపత్యం చెలాయించాలని చైనా యోచిస్తున్నది.