Begin typing your search above and press return to search.
ఇదే భారత్ గొప్పదనం: పాకిస్తాన్ కు కేంద్రం సహాయం
By: Tupaki Desk | 8 Feb 2020 3:30 PM GMTభారతదేశ గొప్పతనం ఏమిటంటే ఆపదలో ఉన్నది శత్రువా.. మిత్రుడా అని ఆలోచించకుండా కాపాడే మనస్తత్వం. అది మన దేశ ప్రజలకు ఉన్న గొప్పతనం. అదే వైఖరిని అంతర్జాతీయంగా కూడా దేశం పాటిస్తోంది. అందుకే అంతర్జాతీయం గా మన దేశానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆదర్శ నిర్ణయం నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడినా.. అంతర్జాతీయ భారత్ పై అక్కసు వెళ్లగక్కినా ఎప్పటికీ భారత్ స్నేహా పూర్వకం గానే పాకిస్తాన్ ను భావిస్తుంది. ఇప్పుడు అదే దేశానికి సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అది ఏ విషయంలోనంటే..
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ కలవర పెడుతోంది. చైనాలోని వూహాన్‌లో వ్యాపించిన వైరస్ ప్రపంచానికి పాకుతోంది. ఈ క్రమంలో అన్ని దేశాలు జాగ్రత్తలు మొదలు పెట్టాయి. అయితే వూహన్ లో కొంతమంది దేశస్తులు చిక్కుకుపోయారు. ఆ వైరస్ సోకకుండా తమ దేశస్తులను ఆ దేశాలు రప్పించుకుంటున్నాయి. అందు లో భాగంగానే మనదేశం నుంచి వెళ్లిన వారిని కూడా రప్పించుకున్నాం. అయితే పాకిస్తాన్ మాత్రం తమ దేశ విద్యార్థులను రప్పించుకునేందుకు సాహసించడం లేదు.
అయితే పాకిస్తాన్ మాత్రం కరోనా వైరస్ లాంటి మహమ్మారిని ఎదుర్కొనే శక్తి తమకు లేదని.. పాక్ విద్యార్థులంతా వూహన్ లో ఉండిపోవాలని ప్రకటించింది. తాము సహాయం చేయలేమని చేతులెత్తేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వూహన్ లో చిక్కుకున్న పాకిస్తాన్ విద్యార్థులను తీసుకువచ్చేందుకు సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వానిపి ఆదుకునేందుకు మోదీ సర్కార్ ముందుకు వచ్చిందని, పాక్ విద్యార్థులను ప్రత్యేక విమానం లో ఇస్లామాబాద్ తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్యసభ లో విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ప్రకటించారు.
చైనాలోని వూహాన్ కు రెండు ఎయిర్ ఇండియా విమానాలను పంపామని.. అక్కడ ఉన్న భారతీయులతో పాటుగా పొరుగు దేశాలకు చెందిన వారిని కూడా తీసుకు వస్తామని మంత్రి వెల్లడించారు. రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. భారత్ ఇటీవల చైనా నుంచి సుమారు 638 భారతీయులను, ఏడు మంది మాల్దీవ్స్ కు చెందిన వారిని వెనక్కి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వూహాన్ లో ఇంకా 80 మంది భారతీయులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. వీరిలో 10 మందికి కరోనా లక్షణాలు ఉండడం తో చైనా అధికారులు వారిని అక్కడే ఉంచేశారని వెల్లడించారు. వైద్యుల పరిరక్షణ లోనే 80 మంది భారతీయులు ఉన్నారని ఎంబసీ అన్ని విషయాలను పర్యవేక్షిస్తోందని తెలిపారు.