Begin typing your search above and press return to search.
సర్జికల్ స్ట్రైక్స్ తో పాటు ఇంకొన్ని స్కెచ్ లు రెడీ
By: Tupaki Desk | 28 Jun 2017 10:14 AM GMTఇటీవలి కాలంలో సరిహద్దులో దూకుడుగా ప్రవర్తిస్తున్న పాకిస్థాన్ పై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఘాటుగా రియాక్టయ్యారు. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలంటే సర్జికల్ దాడులే కాదు.. తమ దగ్గర చాలా మార్గాలు ఉన్నాయని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. `చాలా ఈజీగా యుద్ధం చేస్తూ.. ఫలితాలు సాధిస్తున్నామని పాకిస్థాన్ భావిస్తూ ఉండొచ్చు. కానీ మా దగ్గర చాలా మార్గాలున్నాయి. వాటి వల్ల పాక్ పై చాలా ప్రభావం పడుతుంది. అప్పుడు ఆలోచించుకోవాల్సి వస్తుంది`` అని పరోక్షంగా భారత ఆర్మీ సత్తాను చాటిచెప్పారు.
ఇద్దరు జవాన్లను పాక్ ముక్కలుగా నరికిన తీరును బిపిన్ రావత్ తనదైన శైలిలో విశ్లేషించారు. ``పాక్ దుశ్చర్యకు పాల్పడింది. మన ఆర్మీ అంత అనాగరికంగా వ్యవహరించదు. వాళ్లలాగా తలలు లెక్కపెట్టం. మన ఆపరేషన్ విధానాలు వేరేగా ఉంటాయి``అని రావత్ అన్నారు. ఇక హిజ్బుల్ చీఫ్ సలాహుద్దీన్ ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంపై మాట్లాడుతూ.. దీనిపై పాకిస్థాన్ స్పందన కోసం ఎదురుచూస్తానని చెప్పారు. అయినా దీనివల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇక కశ్మీరీ నేతలతో చర్చలపై స్పందిస్తూ.. ముందు అక్కడ శాంతి నెలకొన్న తర్వాతే చర్చలుంటాయని స్పష్టంచేశారు. ``ఆర్మీకి చాలా పని ఉంది. అక్కడ శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉంది. మా కాన్వాయ్ లపై రాళ్ల దాడి ఎప్పుడు ఆగుతుందో ఆ రోజు నేనే చర్చలు మొదలుపెడతాను`` అని బిపిన్ రావత్ స్పష్టంచేశారు. కశ్మీరీ యూత్ ను తప్పుదారి పట్టిస్తున్నారని, అక్కడి యువనేతలతో మాట్లాడటానికి తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఇక మేజర్ ఎన్ ఎల్ గొగోయ్ ఆర్మీ జీప్ నకు మానవ కవచాన్ని వాడటాన్ని మరోసారి బిపిన్ సమర్థించారు. ఈ సందర్భంగా శ్రీనగర్ మసీదు బయట డీఎస్పీని కొట్టి చంపిన ఉదంతాన్ని ఆయన గుర్తు చేశారు. ``ఆ రోజు ఎన్నికల సంఘం సిబ్బంది జీపులో ఉన్నారు. వాళ్లపై ఈ దాడి జరిగి ఉంటే ఏం జరిగేది? అందుకే అక్కడి పరిస్థితిని బట్టి మా వాళ్లు ఏం చేసినా ఆమోదిస్తాను`` అని బిపిన్ స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/